నటి మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.ఈయన మొదటినుంచి ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ ఉండేవారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో కుటుంబం మొత్తం కరోనా బారిన పడటంతో ఈయనకు పోస్ట్ కోవిడ్ సమస్య మరింత అధికమైంది.ముందుగానే ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఈయన ఎక్కువగా పావురాళ్లమధ్య అధిక సమయం గడపటం వల్లే ఈయనకు ఇన్ఫెక్షన్ మరి కాస్త ఎక్కువ ఇలాంటి పరిస్థితులకు దారి తీసింది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
తాజాగా విద్యాసాగర్ మృతి పట్ల మీనా స్నేహితురాలు కొరియోగ్రాఫర్ కళా మాస్టర్ స్పందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీనా భర్త ఎంతో మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి.
ప్రస్తుతం ఇండస్ట్రీలో మీనా ఈ స్థాయిలో ఉందంటే అందుకు కారణం విద్యాసాగర్ అని కళ మాస్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇకపోతే మీనా తల్లి పుట్టిన రోజు సందర్భంగా అందరం ఫిబ్రవరి నెలలో కలిసాము.
అప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.మధ్యలో ఒకసారి ఫోన్ చేసినప్పుడు తన ఆరోగ్య పరిస్థితి బాలేదని మీనా వెల్లడించారు.
అయితే ఆరోజు నా పుట్టిన రోజు కావడంతో ఆయనను పరామర్శించడానికి వెళ్తే నాకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇక ఏప్రిల్ నెలలో విద్యాసాగర్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షయణించిపోయింది ఈయనకు లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని వైద్యులు సూచించారు.దాతల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసాము.తమిళనాడు ముఖ్యమంత్రి మంత్రులను కలిసి దాతల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
ఆయనను కాపాడుకోవాలని చేయని ప్రయత్నం అంటూ లేదు.అయితే ఆయన కన్ను మూసే వరకు ఎంతో ధైర్యంతో ఉన్నారని ఈ సందర్భంగా కళా మాస్టర్ విద్యాసాగర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy