రమ్య నుంచి ప్రాణ హాని ఉంది.. సంచలన వ్యాఖ్యలు చేసిన నరేష్?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది కేవలం నరేష్నటి పవిత్ర లోకేష్ విషయమే అని చెప్పాలి.

గత కొద్దిరోజులుగా వీరి రిలేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో సీన్లోకి నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి ఎంట్రీ ఇచ్చారు.

అయితే రమ్య ఈ సందర్భంగా కనడ మీడియాతో మాట్లాడుతూ కేవలం పవిత్ర లోకేష్ కారణంగానే తాను తన భర్త నరేష్ విడిపోయామని ఇప్పటికీ మాకు ఇంకా అధికారికంగా విడాకులు రాలేదని వెల్లడించారు.ఇలా రమ్య తన జీవితం ఇలా కావడానికి కారణమైన నరేష్ గురించి పవిత్ర లోకేష్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే నరేష్ రమ్య వ్యాఖ్యలపై స్పందిస్తూ తన గురించి ఎన్నో విషయాల గురించి ఓపెన్ అయ్యారు.రమ్య ఎప్పుడు తన ఫ్యామిలీకి దూరంగా ఉండాలని కోరుకుందని, ఎప్పుడు తనకు ఒక భార్యగా ప్రవర్తించలేదని తనకు ఇతరులతో అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.

ముఖ్యంగా రమ్యకు డబ్బు పిచ్చి ఎక్కువగా ఉంది డబ్బు కోసం నన్ను ఎన్నోసార్లు బ్లాక్మెయిల్ చేసిందని ఈయన తెలిపారు.డబ్బు కోసం ఏకంగా కృష్ణ గారి వద్దకు వెళ్తే నేనే తనకు పది లక్షలు ఇచ్చానని అలాగే హైదరాబాద్లో తాను చేసిన అప్పులన్నీ నేనే కట్టానని ఈయన వెల్లడించారు.

We Have A Danger To The Ramya Naresh Sensational Comments Actor Naresh, Tollywoo
Advertisement
We Have A Danger To The Ramya Naresh Sensational Comments Actor Naresh, Tollywoo

రమ్యకు మానసిక పరిస్థితి సరిగా లేదని అందుకే ఇలా ప్రవర్తిస్తోందని నరేష్ వెల్లడించారు.ఆమెకు ఎమ్మెల్యే కావాలన్నదే ధ్యేయం అందుకోసం డబ్బు అవసరం ఆ డబ్బు కోసమే ఇలా బ్లాక్ మెయిల్ చేస్తోందని నరేష్ వెల్లడించారు.రమ్య నుంచి, తన ఫ్యామిలీ నుంచి తనకు ప్రాణ హాని ఉండటం వల్లే నేను తనకు లీగల్ గా నోటీసులు పంపించానని నరేష్ ఈ సందర్భంగా అసలు విషయం బయటపెట్టారు.

తాను మగాన్నని తనకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి.నాకు ఎమోషనల్ సపోర్ట్ కావాల్సిన సమయంలో పవిత్ర పరిచయమైందని అలాగే తను నాతో పాటు గత మూడు సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తుందని నరేష్ వెల్లడించారు.

పవిత్ర నా జీవితంలోకి వచ్చి మూడు సంవత్సరాలే కానీ 8 సంవత్సరాల క్రితమే రమ్య నా జీవితంలో నుంచి వెళ్లిపోయిందని ఈ సందర్భంగా రమ్య గురించి నరేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు