ఆ సినిమా వల్ల ఇద్దరం 12 కోట్లు నష్టపోయాం: అశ్వినీ దత్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ పథకంపై ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చిన ఘనత నిర్మాత అశ్వినీదత్ కే చెల్లిందని చెప్పాలి.

ఈయన బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

తాజాగా ఈయన నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం సీతారామం.ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇకపోతే తాజాగా నిర్మాత అశ్వినీదత్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన బ్యానర్ లో వచ్చిన సినిమాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఇక హిందీలో ఈయన పెళ్లి సందడి సినిమా చేశామని ఈ సినిమా మంచి హిట్ కావడంతో అనంతరం నేను అల్లు అరవింద్ కలిసి ప్రముఖ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తో కలిసి చూడాలని ఉంది అనే సినిమాని చేశామని ఈయన తెలిపారు.ఈ సినిమా చేసినందుకు మాకు మంచి కానుకలు వచ్చాయని అవే చరి 6 కోట్ల రూపాయల నష్టం అంటూ ఈ సందర్భంగా ఈ సినిమా డిజాస్టర్ గురించి అశ్వినీ దత్ పేర్కొన్నారు.

Advertisement

ఈ క్రమంలోనే ఈయన జాతి రత్నాలు సినిమా గురించి కూడా ప్రస్తావించారు.ఈ సినిమా కథ విన్నారా అని అలీ ప్రశ్నించగా అసలు కథ ఉంటే కదా వినడానికి అన్ని కామెడీ సీన్స్ అంటూ ఆయన తెలిపారు.సినిమా విడుదలైన తర్వాత థియేటర్ కి వెళ్లాను.

అయితే సినిమా చూస్తుంటే వేసుకున్న మాస్క్ తీసేసి ఎంతో బిగ్గరగా నవ్వుతూ సినిమాని ఎంజాయ్ చేశానని ఈ సందర్భంగా అశ్వినీ దత్ పేర్కొన్నారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఈయన సినిమాల గురించి చెప్పిన పూర్తి విషయాలు తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...
Advertisement

తాజా వార్తలు