మీ స్మార్ట్ ఫోన్ స్పీకర్‌లో దుమ్ము ఉందా.. ఈ టిప్స్ మీ కోసమే

స్మార్ట్ ఫోన్‌లను ఎంత బాగా చూసుకున్నా, ఒక్కోసారి అవి నీటిలో పడతాయి.లేదా ఏదైనా తాగుతున్నప్పుడు డ్రింక్‌ దానిపై పడిపోవచ్చు.

ఇలాంటి సందర్భాల్లో స్పీకర్ లోపల వాటర్ ఉండిపోతోంది.అంతేకాకుండా చాలా కాలంగా మనం ఫోన్ వాడుతుంటే అందులో దుమ్ము, ధూళి పేరుకు పోతుంది.

అలా పేరుకు పోయిన దుమ్మును శుభ్రం చేసుకునేందుకు కొన్ని టిప్స్ ఉన్నాయి.ముఖ్యంగా " fixmyspeakers.com " అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడం ద్వారా మీ స్మార్ట్ ఫోన్‌లో దుమ్ము బయటికి తీసుకు రావొచ్చు.

దానికి మీరు ఇలా చేయాల్సి ఉంటుంది.ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ క్రోమ్ సెర్చ్ బార్‌లో " fixmyspeakers.com " అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

Advertisement

అందులో దుమ్మును బయటికి పంపడానికి ప్రత్యేక సౌండ్ ఉంటుంది.దానిని నొక్కగానే ప్రత్యేక సౌండ్ వస్తుంది.

తద్వారా మీ ఫోన్లలో దుమ్ము, ధూళి కొంత బయటకు వచ్చేస్తుంది.ఈ పద్ధతిలో మొత్తం దుమ్ము బయటకు పోకపోవచ్చు.

అయితే మీ ఫోన్ స్పీకర్ మాత్రం శుభ్రం అవుతుంది.

ఇక మనం ఏవైనా డ్రింక్స్ తాగుతున్నప్పుడు కూడా అవి ఫోన్లపై పడే ప్రమాదం ఉంది.అలాంటి సమయాల్లో కొంత వాటర్ ఫోన్ లోపలికి పోతుంది.ఇలాంటి సందర్భంలో మనం చింతించాల్సిన పని లేదు.Fixmyspeakers.com అనేది మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ స్పీకర్‌ల నుండి నీటిని బయటకు పంపడానికి మిమ్మల్ని అనుమతించే ఒక సాధారణ యుటిలిటీ వెబ్‌సైట్.మీ ఆండ్రాయిడ్ బ్రౌజర్‌లో fixmyspeakers.comని తెరిచి, వాటర్ ఎజెక్ట్ బటన్‌ను నొక్కండి.ఫోన్ స్పీకర్ల నుండి ట్యూన్ ప్లే చేయడం ప్రారంభిస్తుంది మరియు మీరు దగ్గరగా చూస్తే, స్పీకర్ గ్రిల్ నుండి నీరు రావడం మీకు కనిపిస్తుంది.మీ ఫోన్ బ్లూటూత్ స్పీకర్‌లు లేదా ఇయర్‌ఫోన్‌లకు కనెక్ట్ చేయకుండా ఈ పని చేయాలి.

Amerio Erfahrungen Und Reputation : Eine Analytische Einordnung
తలనొప్పి తగ్గటానికి చేసే ఈ పనులు...తలనొప్పిని పెంచుతాయా?

లేకుంటే మీ ఫోన్ నుంచి వాటర్ బయటకు పోదు.

Advertisement