దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు గంట ఎందుకు కొడతారు?

సాధారణంగా దేవాలయంనకు వెళ్ళినప్పుడు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ గంట కొడుతూ ఉంటాం.అలాగే గుడిలో పూజారి హారతి ఇచ్చే సమయంలో కూడా గంట కొట్టటం సహజమే.

అసలు గంట ఎందుకు కొడతారు? దానిలో ఉన్న పరమార్ధం గురించి తెలుసుకుందాం.

గంటను మ్రోగించినపుడు ‘ఓం’ అనే ప్రణవనాదం వెలువడుతుంది.ఆ గంటానాదం మన మనస్సులోని చింతలను పోకొట్టి మన మనస్సు భగవంతుని మీద ధ్యానం అయ్యే విధంగా మరల్చుతుంది.మండపంలోని గంట దేవుడిని దర్శిస్తున్న వ్యక్తి చెవిలో ఓం కార ధ్వనిని నింపడానికి ఉపయోగించే గంట.దేవుడికి ఎదురుగా మండపంలో ఉన్న గంటను హారతి ఇచ్చే సమయంలో మోగించకూడదు.ఎందుకంటే ఆ ఓంకార నాదానికి సమానమైన అనుకరణ ధ్వనిని లోలో పల వింటూ మాత్రమే దైవాన్ని దర్శించాలి.

అనుకరణ ధ్వని అంటే.గంటకొట్టాక కొంతసేపటి వరకూ వచ్చే చిన్నపాటి ఊ అని విని పించే శబ్ధం అన్నమాట.

Advertisement

ఇక హారతి గంట ఎందుకంటే దేవతలను ఆహ్వానిస్తున్నామని చెప్పటానికి హారతి ఇచ్చే సమయంలో గంట కొడతాం.అలాగే ఆ హారతి వెలుగులో దేవుని రూపాన్ని చూడవచ్చు.

శబరిమల 18 మెట్ల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?
Advertisement

తాజా వార్తలు