ఎప్పుడు తాగిన తాగకపోయినా ఈ సమయాల్లో మాత్రం వాటర్ ఖచ్చితంగా తాగాలి.. తెలుసా?

మన శరీరానికి నీటి అవసరం ఎంతో ఉంది.శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు డీహైడ్రేషన్ కు గురవుతుంటారు.

దీని కారణంగా ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి.అలసట, నీరసం, తీవ్రమైన తలనొప్పి, కళ్ళు తిరగడం, నోరు పొడిబారడం, అధిక దాహం ఇలా డీహైడ్రేషన్ బారిన ప‌డితే అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

అందుకే శరీరానికి సరిపడా నీటిని అందించడం ఎంతో అవసర‌మ‌ని ఆరోగ్య నిపుణులు ప‌దే ప‌దే చెబుతుంటారు.అయితే వాటర్ ( Water )ఎప్పుడు తాగిన తాగకపోయినా ఇప్పుడు చెప్పబోయే సమయాల్లో మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి.

మ‌రి ఆ టైమింగ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఉదయం లేవగానే బ్రష్ చేసుకున్న( after Brush ) అనంతరం తప్పకుండా ఒకటి లేదా రెండు గ్లాసుల వాటర్ ను తీసుకోవాలి.

Advertisement

గోరు వెచ్చిని వాట‌ర్ దాగితే ఇంకా మంచిది.దీని వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి.

అదే స‌మ‌యంలో మెటబాలిజం రేటు ఇంప్రూవ్ అవుతుంది.వర్కౌట్ అనంతరం ఒక గ్లాస్ వాటర్ ను ఖచ్చితంగా తీసుకోవాలి.

వర్కౌట్ అనంతరం( After workout ) వాటర్ తాగడం వల్ల హార్ట్ రేట్ నార్మల్ అవుతుంది.

అలాగే భోజనం చేయడానికి అర గంట ముందు ఒక గ్లాస్ వాటర్ ను తాగాల‌ని నిపుణులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల జీర్ణం వ్యవస్థ( digestive system ) చురుగ్గా మారుతుంది.గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటివి దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

అదే సమయంలో భోజనాన్ని తక్కువ తీసుకుంటారు.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.

Advertisement

స్నానం చేయడానికి ముందు కూడా ఒక గ్లాస్ వాటర్ ను సేవించాలి.

స్నానం( before bath ) చేయడానికి ముందు వాటర్ ను తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.నీరసంగా అలసటగా అనిపించినప్పుడు ఖ‌చ్చితంగా ఒకటి లేదా రెండు గ్లాసుల వాటర్ ను తీసుకోవాలి.వాటర్ మిమ్మల్ని ఎనర్జిటిక్ గా మారుస్తుంది.

నీరసం అలసట నుంచి కొంత రిలీఫ్ ను అందిస్తుంది.ఇక‌ నైట్ నిద్రించే ముందు సైతం ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్ తీసుకోవాలి.

దీని కారణంగా మీ బాడీ రాత్రి స‌మ‌యాల్లో హైడ్రేటెడ్ గా ఉంటుంది.మ‌రియు శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు సైతం తొలగిపోతాయి.

తాజా వార్తలు