పంటలలో పాటించవలసిన నీటి యాజమాన్య పద్ధతులు..!

పంటలకు నీరు నేలలోని తేమశాతాన్ని బట్టి అందించాల్సి ఉంటుంది.

నీరు ఎక్కువైన లేదంటే తక్కువైనా పంట దిగుబడిపై పూర్తి ప్రభావం చూపి దిగుబడి తగ్గే అవకాశం ఉంది.

కాబట్టి ఏ పంటకు ఏ సమయంలో నీరు( Water ) ఎంత అందించాలి అనే దానిపై అవగాహన ఉండాలి.

వరి పంట:

వరి పంటకు( Rice Crop ) నీరు ఇంకని నల్లరేగడి, ఒండ్రు నేలలు చాలా అనుకూలం.నాట్లు వేసేటప్పుడు పొలంలో నీరు పలుచగా ఉండాలి.

ఎండ ఎక్కువగా ఉంటే ఐదు సెంటీమీటర్ల మేర నీరు నిలవ కట్టాలి.పొలంలో నీరు రెండు సెంటీమీటర్ల కంటే తక్కువ ఎప్పుడూ ఉండకూడదు.

కోతకు పది రోజుల ముందు నుంచే నెమ్మదిగా నీటిని తగ్గించి పొలాన్ని ఆరబెట్టాలి.

జొన్న పంట:

వర్షాధారంగా అయితే నీరు కట్టాల్సిన అవసరం లేదు.రబీలో అయితే జొన్న పంట( Jowar Crop ) పూత మరియు గింజ పాలు పోసుకునే సమయంలో నీరు అందిస్తే దిగుబడి పెరిగే అవకాశం ఉంది

Water Management Practices In Cultivation Details,water Management ,cultivation,
Advertisement
Water Management Practices In Cultivation Details,water Management ,cultivation,

మొక్క జొన్న:

ఈ పంటకు నీతిని పుష్కలంగా అందిస్తే అధిక దిగుబడి సాధించవచ్చు.పూతకు ముందు పూత దశలో మరియు గింజ పాలు పోసుకునే దశలో సమృద్ధిగా నీటి తడులు అందించాలి.విత్తిన 40 రోజుల లోపు లేత పైరుకు అధిక నీరు హానికరం.

విత్తిన తర్వాత పొలంలో నీరు నిల్వ ఉంటే విత్తనం మొలక ఎత్తదు.పంట కాలంలో దాదాపుగా 8 నీటి తడులు అవసరం.

Water Management Practices In Cultivation Details,water Management ,cultivation,

ప్రత్తి:

ఈ పంటకు నీళ్లలోని తేమశాతాన్ని( Soil Moisture ) బట్టి 20 రోజులకు ఒకసారి నీటి తడులు అందించాలి.పంట పూత మరియు కాయ దశలో ఉన్నప్పుడు తగినంత తేమ శాతం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

శనగ:

ఈ పంటకు నీటి అవసరం చాలా తక్కువ.నల్లరేగడి నేలలలో నిలువ ఉండే తేమాతో పాటు శీతాకాలంలోని మంచు వల్ల మొక్కలు పెరుగుతాయి.

నేలలోని తేమ శాతాన్ని బట్టి పంట పూత దశకు వచ్చే సమయంలో, గింజ గట్టిపడే దశలో ఒకసారి తేలికపాటి నీటి తడిని అందించాలి.కాస్త నీరు నిల్వ ఉన్న మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది.

కాబట్టి ఈ జాగ్రత్తలను గుర్తుంచుకొని పంటకు నీటి తడులను అందించాలి.

Advertisement

తాజా వార్తలు