మా చట్టాలను గౌరవిస్తే అమెరికా అవకాశాల గని.. లేదంటే : భారతీయ విద్యార్ధులకు వార్నింగ్

అమెరికాలో పరిస్ధితులు దారుణంగా తయారైన సంగతి తెలిసిందే.ట్రంప్ యంత్రాంగం ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో తెలియక వలసదారులు, అంతర్జాతీయ విద్యార్ధులు బిక్కుబిక్కుమంటున్నారు.

ఇప్పటికే వేలాది మంది వలసదారులకు .ముఖ్యంగా విద్యార్ధులకు పలు కారణాలతో వీసాలు రద్దయ్యాయి.ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ ( US State Department )కీలక ప్రకటన విడుదల చేసింది.

అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే బహిష్కరణ సహా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అంతర్జాతీయ విద్యార్ధులకు హెచ్చరిక జారీ చేసింది.

అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మార్గరెట్ మాక్లియోడ్( Margaret MacLeod ) మాట్లాడుతూ.ట్రంప్ పరిపాలన యంత్రాంగం.ఇమ్మిగ్రేషన్, జాతీయత చట్టం సహా ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినంగా అమలు చేస్తుందని తెలిపారు.

Advertisement

మీరు చట్టాన్ని పాటిస్తే అమెరికా విలువైన అవకాశాలను అందిస్తుందని.అదే చట్టాన్ని ఉల్లంఘించేవారు తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని మార్గరెట్ వివరించారు.

మార్గరెట్ వ్యక్తిగత కేసులను ప్రస్తావించలేదు.అక్రమ వలసల సమస్యను ప్రస్తావించిన ఆమె.అమెరికాలో చట్ట విరుద్ధంగా ఉన్నవారు స్వదేశాలకు వెళ్లిపోవాలని తెలిపారు.ఇందుకోసం డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీ ( Department of Homeland Security )రూపొందించిన సీబీపీ వన్ యాప్ వైపు చూపిస్తూ మార్గరెట్ వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్తులో కఠినమైన చర్యలను ఎదుర్కోవడం కంటే స్వచ్ఛందంగా తిరిగి వెళ్లిపోవడమే మంచిదని ఆమె సూచించారు.

ఇటీవల చాలా మంది భారతీయ విద్యార్ధులు తమ ఎఫ్ 1 వీసాలు రద్దు చేయబడుతున్నాయని బయటపెట్టడం కలకలం రేపింది.పాలస్తీనా అనుకూల నిరసనల్లో పాల్గొనడంతో పాటు స్వల్ప స్థాయి చట్టపరమైన ఉల్లంఘనల కారణంగా మరికొందరి వీసాలను అమెరికా ప్రభుత్వం రద్దు చేసింది.అమెరికాలోని పరిస్ధితులను నిశితంగా గమనిస్తోన్న భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయంపై బాధిత విద్యార్ధులతో సంప్రదింపులు జరుపుతోంది.

How KYC, Fast Payouts And Self‑Exclusion Work For Crypto Users At WPT Global (Canada)
High Roller Tipps & Casino

ఏ దేశం వెళ్లినా ఆయా దేశాల చట్టాలను గౌరవించాలని భారతీయ పౌరులకు కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు