వరంగల్ - ఖమ్మం -నల్గొండ ఎమ్మెల్సీ ఉపఎన్నిక.. సాయంత్రం వరకు పోలింగ్..!!

వరంగల్ - ఖమ్మం - నల్గొండ( Warangal - Khammam - Nalgonda ) పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ( MLC by-election ) పోలింగ్ కొనసాగుతోంది.

ఈ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు.

కాగా ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది.ఈ క్రమంలోనే వచ్చే నెల 5వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడి కానున్నాయి.

కాగా ఈ పోలింగ్ కోసం మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు.అలాగే సుమారు మూడు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారని తెలుస్తోంది.

ఒక పోలింగ్ కేంద్రంలో సగటున ఎనిమిది వందల మంది ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలింగ్ సెంటర్స్ ను అధికారులు ఏర్పాటు చేశారు.

Advertisement
How Modern Technology Shapes The IGaming Experience

తాజా వార్తలు