వార్2 మూవీకి ఆ ఫైట్ హైలెట్ కానుందా.. ఆ 15నిమిషాలు అభిమానులకు పూనకాలే!

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ( Junior NTR )స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తారక్ ప్రస్తుతం వార్2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

వార్2 సినిమాలో తారక్ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.వార్2 సినిమాకు( War2 movie ) ఒక ఫైట్ హైలెట్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.వార్2 సినిమాలో తారక్ హృతిక్( Hrithik ) మధ్య 15 నినిమిషాల ఫైట్ ఉంటుందని ఈ ఫైట్ హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్ అని 15 నిమిషాలు అభిమానులకు పూనకాలే అని సమాచారం అందుతోంది.వార్2 సినిమాకు అయాన్ ముఖర్జీ ( Ayan Mukherjee )దర్శకుడు కాగా ఈ సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ నుంచి క్లైమాక్స్ సీన్ వరకు ప్రతి సీన్ వేరే లెవెల్ లో ఉంటుందని సమాచారం అందుతోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఎన్నో క్రేజీ రికార్డులను సొంతం చేసుకున్నారు.వార్2 సినిమా పాన్ ఇండియా స్థాయిలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయనుంది.2025 సంవత్సరం ఆగష్టు నెల 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.వార్2 సినిమా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండగా హృతిక్, తారక్ పాత్రలకు సంబంధించిన ట్విస్టులు ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా కోసం లిమిటెడ్ గా రెమ్యునరేషన్ తీసుకున్నారని బోగట్టా.వార్2 సినిమాకు సంబంధించిన అధికారిక అప్ డేట్స్ రావాల్సి ఉంది.ఐదు భాషల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.హృతిక్ కు సైతం సౌత్ లో ఈ సినిమాతో మార్కెట్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

తారక్ ప్రశాంత్ మూవీ షూట్ ఎప్పటినుంచి మొదలవుతుందో చూడాల్సి ఉంది.

పాన్ ఇండియాలో కూడా మార్కెట్ లేని మహేష్ బాబు తో రాజమౌళి భారీ రిస్క్ చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు