చిరంజీవి గారితో నటించాలని ఉంది... వైరల్ అవుతున్న లావణ్య త్రిపాఠి కామెంట్స్!

అందాల రాక్షసి( Andala Rakshasi ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) .

ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకున్నారు.

ఇలా తెలుగులో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె త్వరలోనే తెలుగింటి కోడలుగా అడుగుపెట్టబోతున్నారు.ఈమె మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉండటమే కాకుండా త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.

ఇప్పటికే వీరి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే.

ఈ విధంగా వరుణ్ తేజ్ (Varun Tej) లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అని తెలియడంతో గతంలో లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీ గురించి అలాగే మెగా హీరోల గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి హీరో నిఖిల్( Nikhil ) తో కలిసి నటించిన అర్జున్ సురవరం ( Arjun Suravaram )సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఈమె మెగాస్టార్ చిరంజీవి గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో భాగంగా యాంకర్ సుమ( Anchor Suma ) లావణ్య త్రిపాఠినీ ప్రశ్నిస్తూ కొన్ని ప్రశ్నలు వేశారు.ఇందులో భాగంగా సుమ ప్రశ్నిస్తూ మీకు కనుక తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) హీరో నిఖిల్ ఈ ముగ్గురిలో కలిసిన నటించే అవకాశం ఓకే సారి వస్తే మీరు ఎవరితో నటిస్తారు అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఈమె కొంత సమయం పాటు ఆలోచిస్తూ ఈ ముగ్గురి హీరోలలో చిరంజీవి గారు చాలా సీనియర్ హీరో కాబట్టి ముందుగా తనతో కలిసి నటించాలని కోరుకుంటాను అంటూ లావణ్య త్రిపాఠి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 
Advertisement

తాజా వార్తలు