వస్తువుల ఎం.ఆర్.పి ధరల వెనకున్న అసలు సీక్రెట్ మీకు తెలుసా.? ఎవరు నిర్ణయిస్తారంటే.?

మార్కెట్‌లో మ‌నం కొనే వ‌స్తువుల‌పై ఉండే ఎంఆర్‌పీ గురించి మీకు తెలుసా.? దీన్నే మాగ్జిమ‌మ్ రిటెయిల్ ప్రైస్ (Maximum Retail Price – MRP) అంటారు.

అంటే.

రిటెయిల‌ర్ మ‌న‌కు వ‌స్తువును అమ్మే గ‌రిష్ట ధ‌ర అన్న‌మాట‌.ఎవ‌రైనా దీనికి ఎక్కువ ధ‌ర‌కు వ‌స్తువుల‌ను విక్ర‌యించ‌రాదు.

ఎంఆర్‌పీకి స‌మానంగా లేదంటే ఎంఆర్‌పీ క‌న్నా త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తువుల‌ను విక్ర‌యించ‌వ‌చ్చు.అయితే చాలా వ‌ర‌కు పెద్ద పెద్ద మార్ట్‌లు, సూప‌ర్ మార్కెట్‌ల‌లో మ‌న‌కు ఎంఆర్‌పీ క‌న్నా త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తువుల‌ను అందిస్తారు.

డిస్కౌంట్ పేరిట ఎప్పుడూ కొన్ని వ‌స్తువుల‌ను ఎంఆర్‌పీ క‌న్నా త‌క్కువ‌కే ఇస్తారు.

Advertisement

ఎంఆర్‌పీ అంటే గరిష్ట చిల్లర ధర.దానిని ప్రభుత్వం నిర్ణయించదు.కంపెనీలు మాత్రమే ఆ ధర నిర్ణయిస్తాయి.

కాబట్టి నిరభ్యంతరంగా బేరసారాలు సాగించవచ్చు.సాధారణంగా మాల్స్‌లో ధరలను ఫిక్స్‌ చేసి అమ్ముతుంటారు.

కానీ ఇతర చోట్ల ఈ బేరసారాలను సాగించేఅవకాశాలు ఎక్కువగా ఉంటాయి.ఎంత తగ్గినా లాభపడినట్లే కదా! ఉత్పత్తి నాణ్యత, పరిమాణం, స్వచ్ఛత, ప్రమాణాలు, ధర, అమ్మకం తరువాత సేవలు తదితర అంశాలను తెలుసుకునే అవకాశం వినియోగదారులకు అందించే హక్కు ఇది.లేబులింగ్‌ సరిగా లేకపోవడం దగ్గర నుంచి తమకు సరైన సమాధానం లభించలేదనిపిస్తే ఫిర్యాదు చేయవచ్చు.

కఠినమైన చర్మాన్ని సూపర్ స్మూత్ గా మార్చే సింపుల్ టిప్ మీకోసం!
Advertisement

తాజా వార్తలు