ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో నుంచి అదిరిపోయే ఫీచర్లతో మరో కొత్త స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది.
వివో కంపెనీ నుంచి వివో v30, వివో వి30 ప్రో స్మార్ట్ ఫోన్లు మార్చి 7న భారత మార్కెట్లో లాంచ్ అవ్వనున్నాయి.
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషను వివరాలు ఏమిటో చూద్దాం.ఆన్ లైన్ లో లీక్ అయిన వివరాల ప్రకారం వివో వి30( Vivo V30 ) స్మార్ట్ ఫోన్ 6.78 అంగుళాల కర్వడ్ 1.5k అమోల్డ్ డిస్ ప్లే తో వస్తోంది.120Hz రిఫ్రెష్ రేట్,300Hz టచ్ శాంప్లింగ్ రేట్,2800 నిట్స్ బ్రైట్ నెస్ తో వస్తోంది.ప్రో వెర్షన్ మీడియా టెక్ డైమెన్సిటీ 8200 SoC ని ఎంచుకుంటుంది.
స్టోరేజ్ విషయానికి వస్తే వివో వి30 వేరియంట్ 12GB వరకు LPDDR 4X RAM, 512GB వరకు UFS 2.2స్టోరేజ్ ను అందిస్తుంది.వివో వి30 ప్రో( Vivo V30 Pro ) వేరియంట్ 12GB LPDDR 5X RAM, 512GB UFS 3.1 స్టోరేజ్ తో వస్తుంది.ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS పై పనిచేస్తుంది.5000 mAh బ్యాటరీ సామర్థ్యం తో 80w ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.ios సపోర్టుతో 50ఎంపీ ప్రైమరీ కెమెరా తో ఉంటుంది.అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో( Ultra Wide Angle Lens ) మరో 50ఎంపీ సెన్సార్ తో ఉంటుంది.ప్రో వేరియంట్ ఫోన్ కు అయితే వెనుక వైపు కెమెరా సెటప్ కు 50ఎంపీ పోర్ర్టేయిట్ లెన్స్ తో ఉంటుంది.
ఈ ఫోన్ ను మొత్తం గా చూస్తే సెల్ఫీ ప్రియులకు పండుగే.ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధర అనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.మార్చి ఏడవ తేదీ విడుదల సమయంలో ధర వివరాలు కంపెనీ వెల్లడించనుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy