వైవా హర్ష సుందరం మాస్టర్ టీజర్ చూశారా..?

వైవా హర్ష( Viva Harsha ) ప్రధాన పాత్రలో కళ్యాణ్ సంతోష్ డైరెక్షన్ లో రవితేజ నిర్మిస్తున్న సినిమా సుందరం మాస్టర్( Sundaram Master ).

ఈ సినిమా టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.

గిరిజన గ్రామంలో వారికి ఇంగ్లీష్ నేర్పించడానికి వచ్చిన సుదరం మాస్టర్ గా వైవా హర్ష కనిపించాడు.అతను ఏదో వాళ్లకు చదువు చెబుదామని వెళ్తే అక్కడ వారంతా కూడా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తుంటారు.

తనకు వచ్చి రాని ఇంగ్లీష్ తో అక్కడ వాళ్ల ఫ్లూయెన్స్ ఇంగ్లీష్ వచ్చని తెలుసుకున్న సుందరం ఏం చేశాడు అన్నది సినిమా కథ.

టీజర్ మాత్రం ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనర్( fun filled entertainer ) గా ఇంప్రెస్ చేసింది.అయితే పాయింట్ చాలా చిన్నది దీన్ని రెండు గంటల సినిమాగా లాగడంలో ఎక్కడైనా ల్యాగ్ ఉందేమో చూసుకోవాలి.అదీగాక కథ అంతా ఫన్ తోనే నడిపించాల్సి ఉంటుంది.

Advertisement

ఇందులో ఎలాంటి ట్విస్ట్ లు ఉండే ఛాన్స్ లేదు.మరి సుందరం మాస్టర్ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.

సుందరం మాస్టర్ సినిమా వైవా హర్షాకి మంచి బూస్టింగ్ ఇచ్చే సినిమా అయ్యేలా ఉందని చెప్పొచ్చు.సినిమా టీజర్ బజ్ క్రియేట్ చేసింది.

హర్ష అటెంప్ట్ అతనికి మంచి పేరు తెచ్చేలా ఉందని చెప్పొచ్చు.

జలుబు,దగ్గు, ముక్కు ఇన్ఫెక్షన్స్ ని ఇలా కంట్రోల్ చేయండి
Advertisement

తాజా వార్తలు