విశ్వంభర టీజర్ కోసం 15 రోజులు నిద్రలేని రాత్రులు.. అసలేం జరిగిందంటే?

వశిష్ఠ( Vashishtha ) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం విశ్వంభర( viswambhara ).

తాజాగా ఈ సినిమా టీజర్‌ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

ఈ సందర్భంగా చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది.ఈ మేరకు సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను కూడా పంచుకుంది.

ఈ సినిమా టీజర్‌ ను ప్రిపేర్‌ చేయడం కోసం వశిష్ఠ 15 రోజులు నిద్ర లేకుండా కష్ట పడ్డారని చోటాకే నాయుడు తెలిపారు.ఈ మేరకు మీడియాతో ముచ్చటిస్తూ.

ఈ సినిమా షూటింగ్‌ ఎక్కడివరకు వచ్చింది? అనే ప్రశ్నించగా వశిష్ట మాట్లాడుతూ.ప్రీ ప్రొడక్షన్‌ పనులకు చాలా సమయం తీసుకున్నాము.

Advertisement

సినిమా దాదాపు పూర్తయింది.ఒక పాట చిత్రీకరణే మిగిలి ఉంది.త్వరలోనే దాన్ని కూడా పూర్తిచేస్తాము అని తెలిపారు.

రెండో సినిమా చిరంజీవితో( Chiranjeevi ) చేయాలంటే ఒత్తిడికి గురయ్యారా? అని అడగగా.డైరెక్టర్ మాట్లాడుతూ.

ఒత్తిడికి గురి కాలేదు.సినిమా పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయా అని ఆసక్తిగా ఎదురు చూశాను అని తెలిపారు.

చిరంజీవిని ఎలా ఒప్పించారు? అని అడగగా.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo

చిరంజీవితో ఒక ఫాంటసీ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.ఆయనకు, నిర్మాతకు కథ నచ్చింది.వెంటనే ప్రారంభించాము అని తెలిపారు.ఇందులో పాటల గురించి చెప్పండి? అని అడగగా.5 పాటలు ఉంటాయి.వాటిలో డ్యాన్స్‌కు కూడా ప్రాధాన్యం ఉంటుంది.

Advertisement

ట్రైలర్‌ తర్వాత పాటలు విడుదల అవుతాయి అని తెలిపారు.ఇన్ని రోజుల ప్రయాణంలో చిరంజీవి నుంచి ఏం నేర్చుకున్నారు? అని అడగగా.ఆయన మాకంటే ఎనర్జీగా ఉంటారు.

చాలా విషయాలు నేర్చుకున్నా.వాటి గురించి ఇప్పుడు చెప్పాలంటే సమయం సరిపోదు.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో చెబుతాను అని తెలిపారు దర్శకుడు వశిష్ట.

తాజా వార్తలు