గోపీచంద్ విశ్వం మూవీ ట్విట్టర్ రివ్యూ.. మ్యాచో స్టార్ బ్లాక్ బస్టర్ హిట్ సాధించారా?

టాలీవుడ్ హీరో గోపీచంద్ ( Gopichand )హీరోగా నటించిన తాజా చిత్రం విశ్వం( Vishvam ).

శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా తాజాగా అక్టోబర్ 11న అనగా నేడు థియేటర్లలో విడుదల అయ్యింది.ఇప్పటికే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ గా రెస్పాన్స్ వస్తోంది.

ఇకపోతే తాజాగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులు ఏమంటున్నారు? ట్విట్టర్ టాక్ ఏంటి అన్న వివరాల్లోకి వెళితే.ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సినిమా స్టోరీ రొటీన్ అని, ఇదే తరహాలో గతంలో చాలా సినిమాలు వచ్చాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

గోపీచంద్, కాసిన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి తప్పితే మిగతా అంతా రొటీన్ అని అంటున్నారు.

Advertisement

మరికొందరు మాత్రం కామెడీ పరంగా బాగానే ఉందని అంటున్నారు.ఓవరాల్‌గా అబోవ్ యావరేజ్ ఫిల్మ్( above average film ) అని అంటున్నారు.మరోవైపు సోషల్ మీడియాలో విశ్వం సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తుంది.

శ్రీను వైట్ల( Srinu Whitela ) మార్క్ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్,నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయని అంటున్నారు.విజువల్స్ ఆకట్టుకుంటాయని కొందరు అంటున్నారు.

గోపి చంద్ గత చిత్రాలతో పోల్చితే విశ్వం బాగుందని అంటున్నారు ప్రేక్షకులు.ప్రేక్షకులు ఆశించే కామెడీ, యాక్షన్, రొమాన్స్ అంశాలు సినిమాలో ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

హీరో గోపీచంద్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ అంటున్నారు.ఆయన కామెడీ యాంగిల్ సైతం ఆకట్టుకుంటుందని అంటున్నారు.హీరో హీరోయిన్ కెమిస్ట్రీ పర్లేదు.

Advertisement

కావ్య థాపర్ నటనకు యావరేజ్ మార్క్స్ అంటున్నారు.అయితే ఈ వీకెండ్ కి చూడదగ్గ సినిమానే.

గోపి చంద్ ఫ్యాన్స్ పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తారు.శ్రీను వైట్ల మార్క్ కామెడీ అలరిస్తుంది.

మొత్తంగా చూసుకుంటే ఈ సినిమాకు ఒకవైపు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండగా మరి వైపు నెగటివ్ రెస్పాన్స్ వస్తోంది.

తాజా వార్తలు