విశ్వంభర సినిమాలో ఆ ఒక్క సాంగ్ ఖర్చు అన్ని రూ.కోట్లా.. ఈ లెక్కలు మీకు తెలుసా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి,( Megastar Chiranjeevi ) వశిష్ట( Vassishta ) కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా విశ్వంభర.( Vishwambhara ) ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ అవైటెడ్ మూవీలలో విశ్వంభర సినిమా కూడా ఒకటి.

ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అని అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల అయ్యేది.

కానీ కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేసిన విషయం తెలిసిందే.సోషియో ఫాంటసీ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

బడ్జెట్ విషయంలో కూడా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు మూవీ మేకర్స్.

Vishwambhara Song Costs Rs6 Cr Details, Vishwambhara, Vishwambhara Movie, Rama R
Advertisement
Vishwambhara Song Costs Rs6 Cr Details, Vishwambhara, Vishwambhara Movie, Rama R

ఇదే విషయం ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పాటను చూస్తే బాగా అర్థమవుతుంది.కాగా ఇటీవల ఈ సినిమా నుంచి రామ అనే పాటను విడుదల చేసిన విషయం తెలిసిందే.ఈ పాట కోసం ఖర్చు పెట్టిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల మూవీ మేకర్స్ హనుమాన్ జయంతి సందర్భంగా రామ రామ( Rama Rama Song ) అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.క్యాచీ వర్డ్స్ తో పాటు విజువల్ ట్రీట్ గా అనిపించింది ఈ పాట.అయితే ఈ పాట కోసం దాదాపు ఆరు కోట్లు ఖర్చు పెట్టారట.రామ‌జోగ‌య్య శాస్త్రి అద్భుతమైన పదాలతో రాసిన ఈ పాటకు అంతే మధురమైన సంగీతాన్ని అందించారు కీర‌వాణి.

Vishwambhara Song Costs Rs6 Cr Details, Vishwambhara, Vishwambhara Movie, Rama R

పాట కలర్ ఫుల్ గా కనిపించడంతో పాటు గ్రాండియర్ లుక్ ను తీసుకువచ్చింది.ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారడంతో అభిమానులు ఈ సినిమాపై అంచనాలను పెంచేసుకుంటున్నారు.కాగా రామ రామ అంటూ సాగే పాటను దాదాపు 12 రోజుల పాటు షూట్ చేసారట.దాదాపుగా 400 మంది డాన్స‌ర్లు, 400 మంది జూనియ‌ర్లు, 15 మంది న‌టీన‌టులతో ఈ పాట‌ను అద్భుతంగా తెరకెక్కించారు.4 భారీ సెట్స్‌ లో సాంగ్ ను షూట్ చేశారట.ఈ పాట సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని మేకింగ్ క్వాలిటీ కూడా అదిరిపోయిందని పాటను విన్న మూవీ లవర్స్ చర్చించుకుంటున్నారు.

ఇకపోతే విశ్వంభర మూవీ జూన్ 24న విడుదల కానుంది.ఈ లోపు సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు బాగా చేయాలని మూవీ మేకర్స్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.

సంక్రాంతి నాడు గాలిపటం ఎందుకు ఎగుర వేస్తారు?
Advertisement

తాజా వార్తలు