ముఖచిత్రం" సినిమాలో పవర్ ఫుల్ లాయర్ పాత్రలో విశ్వక్ సేన్, బర్త్ డే పోస్టర్ రిలీజ్

వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "ముఖచిత్రం".

కలర్ ఫొటో సినిమా దర్శకుడు, సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు.

ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు.ఈ సినిమాతో గంగాధర్, దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగు పెడుతున్నారు.

డిఫరెంట్ కథాంశంతో రూపొందిన "ముఖచిత్రం" సినిమాలో ఓ స్పెషల్ రోల్ చేశారు .యువ హీరో విశ్వక్ సేన్. ఇవాళ విశ్వక్ సేన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు.

లాయర్ విశ్వామిత్ర పాత్రలో విశ్వక్ సేన్ కనిపించ నున్నారు.ఈ పాత్ర పవర్ ఫుల్ గా ఉంటూ కథలో కీలకంగా, వ్యవహరిస్తుంది.15 నుంచి 20 నిమిషాలు సినిమాలో ఉండే లాయర్ విశ్వామిత్ర క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ అద్భుతంగా నటించారు.విశ్వక్ సేన్ కుముఖ చిత్రంటీమ్ పుట్టినరోజు విశేస్ తెలిపింది.

Advertisement

ఇప్పటిదాకా సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్ లుక్స్ ఈ మూవీని ఇంటెన్స్ లవ్ స్టోరీ గా ప్రెజెంట్ చేయగా ఇప్పుడు విశ్వక్ సేన్ పోస్టర్, రివీల్ తో ఇదొక ఇంట్రెస్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామాగా తెలుస్తున్నది.మూవీ, టీమ్ లో విశ్వక్ సేన్ యాడ్ అవడంతో "ముఖ చిత్రం" సినిమా మీద మరింత క్రేజ్,పెరిగింది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ముఖ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.

నటీనటులు

- వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్

సాంకేతిక నిపుణులు

- సంగీతం - కాల భైరవ, ఎడిటింగ్ - పవన్ కళ్యాణ్, సమర్పణ - ఎస్ కేఎన్, నిర్మాతలు - ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల, కథ స్క్రీన్ ప్లే మాటలు - సందీప్ రాజ్, దర్శకత్వం - గంగాధర్.

Advertisement

తాజా వార్తలు