జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాను రీమేక్ చేస్తా.. విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన సినిమాలను లేదా క్లాసిక్ సినిమాలలో ఇతర భాషల్లో మంచి హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయడం అన్నది సహజం.

కానీ ఫ్లాప్ అయినా సినిమాలను చాలా తక్కువ మంది మాత్రమే రీమేక్ చేస్తూ ఉంటారు.

ఇప్పుడు టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్( Vishwaksen ) కూడా అలాంటి రిస్క్ కే సిద్ధమవుతున్నారు.ఎన్టీఆర్ ఫ్లాప్ సినిమాను( NTR Flop Movie ) రీమేక్ చేయాలని ఉంది అని చెబుతూ ఒక్కసారిగా షాక్ కు గురి చేశాడు విశ్వక్ సేన్.

జూనియర్ ఎన్టీఆర్ కి( Jr NTR ) విశ్వక్సేన్ వీరాభిమాని అన్న విషయం మనందరికీ తెలిసిందే.ఇదే విషయాన్ని స్వయంగా విశ్వక్ సేన్ పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు.అలాగే తన అభిమానాన్ని కూడా చాటుకున్నారు విశ్వక్ సేన్.

ఇది ఇలా ఉంటే విశ్వక్సేన్ నటించిన తాజా చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.( Gangs Of Godavari ) ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది.

Advertisement

ఈ సందర్భంగా విశ్వక్ సేన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు.అందులో భాగంగానే తాజాగా యాంకర్ సుమకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో విశ్వక్ సేన్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మీకు ఎన్టీఆర్ తో మంచి అనుబంధం ఉంది కదా.ఒకవేళ ఆయన నటించిన సినిమాల్లో ఏదైనా రీమేక్ చేయాలంటే ఏది చేస్తారు? అని సుమ అడగగా.విశ్వక్ సేన్ మాట్లాడుతూ.

నాకు ఎన్టీఆర్ అన్న నటించిన నా అల్లుడు( Naa Alludu Movie ) సినిమా రీమేక్ చేయాలని ఉందీ అని తెలపడంతో ఒక్కసారిగా షాక్ అయ్యింది సుమ.ఆ సినిమా బాగుంటుందీ.కాకపోతే కొన్ని ఛేంజెస్ తో రీమేక్ చేయాలని ఉంది అంటూ తన మనసులోని మాట బయటపెట్టాడు విశ్వక్ సేన్.

అయితే జూనియర్ ఎన్టీఆర్ ఎన్నో హిట్ సినిమాలలో నటించగా ఆ సినిమాలేవి రీమేక్ చేయకుండా ఫ్లాప్ అయిన సినిమాలు రీమేక్ చేస్తాను అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం పడుతున్నారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు