ఆ విషయంలో అమ్మాయిలకు హ్యాట్సాఫ్... విశ్వక్ సేన్ కామెంట్స్ వైరల్!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్( Vishwak Sen ) అప్ కమింగ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమా లైలా( Laila ) .

రామ్ నాయక్  దర్శకత్వంలో విశ్వక్, ఆకాంక్ష శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

ఇటీవల వరుస హిట్ సినిమాల ద్వారా ఫుల్ జోష్ లో ఉన్న విశ్వక్ త్వరలోనే మరో యూత్ ఎంటర్‌టైనర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా సినిమా నుంచి అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.

Vishwak Sen Sensational Comments On Lady Get Up In Laila Movie ,vishwak Sen,akan

తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీ అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు.ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొని సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఇక ఈ సినిమాలో విశ్వక్ అమ్మాయి గెటప్ లో కనిపించబోతున్న విషయం మనకు తెలిసిందే.

Vishwak Sen Sensational Comments On Lady Get Up In Laila Movie ,vishwak Sen,akan

ఇలా అమ్మాయి పాత్రలో నటించడం గురించి విశ్వక్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.అమ్మాయి గెటప్( Lady Getup ) లో రెడీ అవ్వడానికి తనకు చాలా కష్టంగా అనిపించిందని చెప్పారు.లైలా కోసం రెడీ అవ్వడానికి రెండేసి గంటలు పట్టేది.

Advertisement
Vishwak Sen Sensational Comments On Lady Get Up In Laila Movie ,Vishwak Sen,Akan

నిజంగా అమ్మాయిలకు హ్యాట్సాఫ్ చెప్పాలి అంటూ విశ్వక్ తెలియజేశారు.ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఫిల్మ్.

చాలా క్లీన్ ఫిల్మ్ తీశాం.లైలా మీకు నచ్చుతుందనీ, మరో పాటను ఫిబ్రవరి ఒకటో తేదీ విడుదల చేయబోతున్నట్లు కూడా ఈ సందర్భంగా విశ్వక్ తెలియజేశారు.

ఇక తాను ఎప్పటినుంచో ఇలాంటి ఒక పాత్రలో నటించాలని అనుకుంటూ ఉండేవాడిని.ఇక డైరెక్టర్ కథ చెప్పడంతో ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పానని తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది అంటూ విశ్వక్ సేన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Ladies Finger, Reduce Overweight, Overweight, Weight Loss Tips, Benefits Of Ladies Finger For Heal
Advertisement

తాజా వార్తలు