ఆది పురుష్ సినిమాతో కన్నప్పను పోల్చద్దు...అది అసలు రామాయణమే కాదు: మంచు విష్ణు

మంచు విష్ణు( Manchu Vishnu ) ప్రస్తుతం కన్నప్ప ( Kannappa ) సినిమా పనులలో బిజీగా ఉన్నారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి కన్నప్ప సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ఏప్రిల్ 25వ తేదీ విడుదల చేయబోతున్నారు.

ఇలా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమా కోసం మంచు విష్ణు ఎంతో కష్టపడుతున్నారని చెప్పాలి.ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.

అయితే ఈ ఇంటర్వ్యూల సందర్భంగా మంచు విష్ణు చేసే వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు ప్రభాస్ ( Prabhas ) నటించిన ఆది పురుష్( Adipurush ) సినిమా గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.

కన్నప్ప సినిమా మొత్తం మన దేశానికీ సంబంధించిన చిత్రం కథ కదా.మీరెందుకు న్యూజిల్యాండ్ లో ఈ చిత్రాన్ని ఎక్కువ షూటింగ్ చేశారు అంటూ ప్రశ్న వేశారు.దానికి మంచు విష్ణు సమాధానం చెప్తూ మహాభారతం ఎక్కడ జరిగింది అనేది ఎవరికైనా తెలుసా?, కానీ మహాభారతంని వాళ్లకు అనువైన ప్రాంతాల్లో షూట్ చేసుకున్నారు.సినిమా ఎక్కడ షూటింగ్ చేసాము అనేది ముఖ్యం కాదు కానీ ఎలా చేశాము అనేది మాత్రమే ముఖ్యమంటూ తెలిపారు.

Vishnu Sensational Comments On Prabhas Adipurush Movie Details, Prabhas, Kannapp
Advertisement
Vishnu Sensational Comments On Prabhas Adipurush Movie Details, Prabhas, Kannapp

ఇక మా సినిమాని న్యూజిల్యాండ్ లో ఎందుకు తెరకెక్కించామంటే, ఇది మన నేలకు సంబంధించిన కథ ఎక్కువగా దట్టమైన అడవులు, పచ్చదనం ఉట్టిపడే ప్రాంతాలు ఈ సినిమాలో ఎక్కువగా కనిపించాలి.ఒకప్పుడు మన భారతదేశంలో ఇలా అడవులు బాగా ఉండేవి కానీ ఇప్పుడు లేవు అందుకోసమే తాము న్యూజిలాండ్ కు వెళ్లి సినిమా షూటింగ్ చేయాల్సి వచ్చిందని తెలిపారు.

Vishnu Sensational Comments On Prabhas Adipurush Movie Details, Prabhas, Kannapp

ఇక ఇతర దేశాలలో షూటింగ్ జరుపుకున్న ఆది పురుష్ సినిమా ఫ్లాప్ అయింది కదా అంటూ యాంకర్ ప్రశ్నించడంతో వెంటనే విష్ణు మా సినిమాని ఆది పురుష్ సినిమాతో అసలు పోల్చోద్దని తెలిపారు.  ఒకే చోట గ్రీన్ మ్యాట్ వేసి ఆ చిత్రాన్ని తెరకెక్కించారు.అందులోనూ వాళ్ళు తీసింది రామాయణం కాదు, రామాయణం ఇలా ఉంటుంది అని ఊహించి ఆ చిత్రాన్ని తీశారు.

అందుకే ఆ సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యిందంటూ విష్ణు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనగా మారాయి.

నితిన్ రాబిన్ హుడ్ మూవీ సెన్సార్ రివ్యూ.. ఈ హీరో బ్లాక్ బస్టర్ సాధించినట్టేనా?
Advertisement

తాజా వార్తలు