Vishnu Priya : వాళ్ల నోరులను నేను మూయించలేను అందుకే ఇలా చేస్తున్నా: విష్ణు ప్రియ

విష్ణు ప్రియ ( Vishnu Priya ) పరిచయం అవసరం లేని పేరు.

ఈమె ఒకానొక సమయంలో బుల్లితెర యాంకర్ గా ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు.

కానీ ఇటీవల కాలంలో బుల్లితెర కార్యక్రమాలకు కూడా విష్ణు ప్రియ దూరంగా ఉంటున్నారు.ఇలా బుల్లితెర కార్యక్రమాలకు విష్ణు ప్రియ దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె చేసే రచ్చ మామూలుగా ఉండటం లేదు.

ఇక సీరియల్ నటుడు మానస్ తో కలిసి ఈమె పలు ప్రవేట్ ఆల్బమ్స్ చేస్తూ వచ్చారు.ఈ పాటలకు భారీ స్థాయిలో ఆదరణ కూడా లభించింది.

ఇకపోతే బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి విష్ణుప్రియ వెబ్ సిరీస్లలో కూడా నటిస్తున్నారు.మొత్తానికి కెరియర్ పరంగా బిజీగా ఉన్నటువంటి ఈమె తన స్నేహితురాలు రీతు చౌదరి( Rithu Chowdary ) తో కలిసి కూడా భారీగా రచ్చ చేస్తుంటారు.

Advertisement

తరచూ ఇద్దరు వెకేషన్ లకు వెళ్లడం లేదా ట్రెండ్ అవుతున్న పాటలకు రీల్స్ చేయడం చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా విష్ణు ప్రియ ఎలాంటి పోస్టులు చేసిన భారీ స్థాయిలో ఈమె పట్ల నెగిటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు.ఇలా పలుసార్లు తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై స్పందించినటువంటి ఈమె ఘాటుగానే సమాధానం ఇచ్చారు.కానీ ఈ ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు.

ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ వేదికగా ఏదైనా పోస్ట్ చేస్తే తన స్నేహితులు మాత్రమే మెసేజ్ చేసే విధంగా సెట్ చేసి తన మెసేజ్ బాక్స్ డిసేబుల్ చేశారు.

ఇలా మెసేజ్ చేయడానికి వీలు లేకుండా చేయడంతో ఒక నెటిజన్ సరాసరి ఈమెను ఇదే విషయం గురించి ప్రశ్నించారు.సోషల్ మీడియా వేదికగా సరదాగా అభిమానులతో చిట్ చాట్ చేసినటువంటి ఈమెకు నేటిజెన్స్ నుంచి ఇదే ప్రశ్న ఎదురైంది.ఎందుకు మీరు మీ కామెంట్ సెక్షన్ డిసేబుల్ చేశారంటూ ప్రశ్నించగా ఈమె సమాధానం చెబుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వైయస్సార్ బీమా పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం..!!
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోండి..

ప్రతీ ఒక్కరికీ భావా ప్రకటన స్వేచ్చ ఉంది.అందరి అభిప్రాయాలను కొన్ని సార్లు నేను వ్యతిరేకించలేను.వారి నోళ్లను మూయించలేను.

Advertisement

అందుకే నేను నోరు మూసుకున్నానని వాళ్లకు కామెంట్ చేసే అవకాశం లేకుండా చేశానని.అలాంటి అవకాశం వాళ్లకు ఇవ్వాలనుకోవడం లేదు అంటూ విష్ణు ప్రియ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు