''కన్నప్ప'' నుండి ఫస్ట్ లుక్.. బాణం విల్లు పట్టుకుని విష్ణు పోస్టర్ అదిరింది!

ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో కన్నప్ప ( Kannappa ) ఒకటి.

టాలీవుడ్ హీరోల్లో ఒకరైన మంచు విష్ణు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇక ఈయన కెరీర్ స్టార్టింగ్ నుండే ఏ సినిమా చేసిన ప్లాప్ అవుతూనే ఉంది.అయినప్పటికీ పట్టువదలకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

ఇటీవలే జిన్నా వంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఇది కూడా ప్లాప్ లిస్టులోకి చేరిపోయింది.మరి ఈ ప్లాప్ తర్వాత కొద్దీ గ్యాప్ తో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప.ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్.

కన్నప్ప భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండగా న్యూజిలాండ్ లోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంటుంది.

Advertisement

అయితే ఈ రోజు మంచు విష్ణు పుట్టిన రోజు( Manchu Vishnu Birthday ) కావడంతో ఈ సినిమా నుండి ఎవ్వరూ ఊహించని విధంగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ అయ్యి బిగ్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు.ఈ పోస్టర్ లో లో విష్ణు బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాడు.ప్రకృతిలో మహా శివలింగం ముందు బాణం విల్లు పట్టుకుని ఎక్కుపెట్టిన వారియర్ లా విష్ణు దర్శనం ఇచ్చాడు.

ఈ పోస్టర్ తో బిగ్గెస్ట్ అంచనాలను పెంచేశారు.ముఖేష్ కుమార్ సింగ్( Mukesh Kumar Singh )ఈ సినిమాను డైరెక్టర్ చేస్తుండగా మంచు మోహన్ బాబు ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇక మణిరత్నం, స్టీఫెన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ వంటి స్టార్స్ నటిస్తున్నారు.మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

ఈ సినిమాతోనైనా భావన కెరీర్ గాడిలో పడుతుందా.?
Advertisement

తాజా వార్తలు