యంగ్ హీరో విశాల్ రత్నం మూవీ సెన్సార్ రివ్యూ.. ఈ సినిమా టాక్ ఏంటంటే? 

యాక్షన్ హీరో విశాల్ ( Vishal ), మాస్ డైరెక్టర్ హరి ( Director Hari ) కాంబోలో రూపొందిన హ్యాట్రిక్ చిత్రం ‘రత్నం’ ( Rathnam ).

ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో భరణి పూజ వంటి సినిమాలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

అయితే ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్లో మాస్ యాక్షన్ చిత్రంగా రత్నం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది ఈ సినిమా ఏప్రిల్ 26వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

Young Hero Vishal Ratnam Movie Censor Review What Is The Talk Of This Movie, Her

ఇక ఈ సినిమా విడుదల అవుతున్న తరుణంలో సెన్సార్( Censor ) సభ్యులు ఈ సినిమా రివ్యూ ఇచ్చారు.సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమా పాజిటివ్ స్పందనను రాబట్టుకున్నట్లుగా తెలుస్తోంది.యూ/ఏ సర్టిఫికెట్‌‌తో పాటు.

ఈ మూవీలో యాక్షన్‌తో పాటు చక్కని సందేశం ఉందని తెలియజేశారు అంతేకాకుండా ఈ సినిమాని కుటుంబ సమేతంగా కూడా చూడవచ్చని తెలిపారు.

Young Hero Vishal Ratnam Movie Censor Review What Is The Talk Of This Movie, Her
Advertisement
Young Hero Vishal Ratnam Movie Censor Review What Is The Talk Of This Movie, Her

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా మంచి స్పందనను రాబట్టాయి.ఇక ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానున్న తరుణంలో విశాల్ తెలుగులో కూడా భారీ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైనటువంటి ఎటువైపో ఎటువైపో పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసింది ఇక ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ( Devi sri Prasad ) సంగీతమ అందించారు.

మరి 26వ తేదీ విడుదల కాబోయే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు