కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్ సినిమాలలో ఎంతో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు పొలిటికల్ విషయాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తుంటారు.
అయితే గత కొద్దిరోజులుగా ఈయన వచ్చే ఎన్నికలలో కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున చంద్రబాబు నాయుడుకు ఆపోజిట్ గా పోటీ చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలపై స్పందించిన విశాల్ తాను రాజకీయాలకు చాలా దూరంగా ఉంటానని, తను రాజకీయాలలోకి వస్తున్నానంటూ వచ్చే వార్తలు పూర్తిగా అవాస్తవమని ఈ వార్తలను పూర్తిగా ఖండించారు.
ఇలా ఈ విషయం మర్చిపోకముందే ఈయన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నటుడు ఎంజీఆర్ టాటూని తన చాతి పై వేయించుకున్నారు.ఇలా విశాల్ ఎంజీఆర్ టాటూ తన చాతి పై వేసుకుని ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా మరోసారి విశాల్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన వార్తలు ఊపందుకున్నాయి.అయితే విశాల్ తాను ఎంజీఆర్ కు అభిమానిని అంటూ గతంలో పలుమార్లు వెల్లడించిన విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా ఎంజీఆర్ ఫోటో టాటూ వేయించుకోవడంతో ఈయన వచ్చే ఎన్నికలలో అనా డీఎంకే తరఫున పోటీ చేయబోతున్నారా అందుకే పార్టీ సభ్యులతో సన్నిహితంగా మెలగడం కోసమే ఇలా సీఎం ఫోటో టాటూగా వేయించుకున్నారా అనే చర్చలు మొదలయ్యాయి.అయితే మరికొందరు ఈ ఫోటో చూసి ఈయన రాజకీయాల్లోకి కాకుండా ఏదైనా సినిమాలో పాత్ర కోసం ఇలా ఎంజిఆర్ ఫోటోని టాటూగా వేయించుకున్నారేమో అని సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు.ఏది ఏమైనా దివంగత సీఎం ఎంజీఆర్ ఫోటోని ఇలా టాటూగా వేయించుకోవడంతో ఈ విషయం కాస్త కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ, తమిళ రాజకీయాలలోనూ చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy