యాక్షన్ ట్రైలర్ రిలీజ్.. యాక్షన్‌ ఓవర్‌గా ఉందే!

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోగా విశాల్ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు.

తనకు సూట్ అయ్యే పాత్రలు చేస్తూ వస్తున్న ఈ హీరో తాజాగా నటించిన చిత్రం యాక్షన్.

తమిళంలో స్టార్ డైరెక్టర్ అయిన సుందర్ సి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకోగా.తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను రిలజ్ చేశారు.

ఈ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఒకింత నెగెటివ్ ఫీలింగ్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది.ఈ సినిమా అసలు ఇండియన్ సినిమానా లేక వేరేదా అని.ఎందుకంటే ఈ సినిమాలో మెజారిటీ షూటింగ్ పార్ట్ కూడా విదేశాల్లోనే సాగింది.దీంతో ఈ సినిమా ఒరిజినాలిటీ కోల్పోయింది.

ఇక ఈ చిత్ర ట్రైలర్‌లో యాక్షన్ డోస్ ఎక్కువ కాదు.కాస్త ఓవర్ అయ్యిందనే చెప్పాలి.

Advertisement

విశాల్, తమన్నాలు ఎంత పెద్ద స్టార్‌లు అయినా, కంటెంట్ సరిగా లేకపోతే విజయం సాధించడం చాలా కష్టం అంటున్నారు తమిళ తంబీలు.ముందే సుందర్ సి దర్శకత్వం అంటే తమిళ తంబీలు చిరాకు పడుతున్నారు.

ఇటీవల ఆయన తెరకెక్కించిన చిత్రం కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది.దీంతో ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో అని కోలీవుడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

ఏదేమైనా విశాల్ ఫ్యాన్స్ మాత్రం తమ హీరో చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు