విశాఖ ఉక్కు... టీడీపీలో కొత్త సెగ.. మ‌రో ఇద్ద‌రు రాజీనామాలు ?

విశాఖ ఉక్కు ఉద్య‌మం.ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో కొత్త సెగ‌కు దారితీస్తోంది.

 పార్టీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, విశాఖ ఉత్తర నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు.

త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు .అయితే.పైకి ఇది వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార‌మేన‌ని అంటున్నారు.

కానీ, పార్టీలోని ఇత‌ర నాయ‌కుల‌కు ఇది ఇబ్బందిక‌రంగా మారింది.విశాఖ ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ సునామీని కూడా కాద‌ని.

టీడీపీ అభ్య‌ర్థుల‌ను గెలిపించారు.వీరిలో వాసుప‌ల్లి గ‌ణేష్‌ను ప‌క్క‌న పెడితే.

Advertisement
Visakha Steel New SEGA In TDP Two More Resignations From Tdp, Ap,ap Political N

మిగిలిన ముగ్గురిలో ఒక‌రు ఇప్పుడు రాజీనామా చేశారు.దీంతో విశాఖ ప్ర‌జ‌ల్లో టీడీపీపై సానుభూతి ఏర్ప‌డాలంటే.

కేవ‌లం గంటా మాత్ర‌మే రాజీనామా చేయ‌డం స‌రికాద‌ని.మిగిలిన ఇద్ద‌రూ కూడా రాజీనామా చేస్తేనే టీడీపీకి ఈ సానుభూతి ద‌క్కుతుంద‌నే కొత్త వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది.

లేక‌పోతే.గుండుగుత్తుగా ఈ సానుభూతి గంటా ఎగ‌రేసుకుపోయే ప్ర‌మాదం ఉంద‌ని.

ఇది అంతిమంగా.పార్టీకి ఇబ్బందేన‌ని అంటున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

రేపు ఎన్నిక‌ల స‌మ‌యంలో గంటా తాను చేసిన రిజైన్‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్తే.టీడీపీకి వాయిస్ ఉండే అవ‌కాశం లేదు.

Visakha Steel New Sega In Tdp Two More Resignations From Tdp, Ap,ap Political N
Advertisement

ఇక‌, విశాఖ ఉక్కు ఉద్య‌మాన్ని కూడా త‌న‌దైన శైలిలో టీడీపీ ముందుండి న‌డిపించాలి.అమ‌రావ‌తి రాజ‌ధాని కోసం రైతుల‌ను ఏవిధంగా అయితే.ముందుండి న‌డిపించిందో.

ఇప్పుడు విశాఖ ఉక్కు కోసం కూడా అంతే తీవ్రంగా పార్టీ శ్ర‌మించాలి.ఈ క్ర‌మంలో మిగిలిన ఇద్ద‌రిని కూడా రాజీనామా చేయించ‌డంతో పాటు.

పార్టీ వ్యూహాన్ని కూడా ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాలి.ఇప్ప‌టి వ‌ర‌కు ఆదిశగా టీడీపీ ప్ర‌య‌త్నాలు చేయ‌లేదు.

కానీ, మున్ముందు మాత్రం పార్టీ ఈ త‌ర‌హా ఉద్య‌మాల‌కు రెడీ అయితేనే విశాఖ వాసుల్లో టీడీపీపై భ‌రోసా ఏర్ప‌డుతుంద‌ని అంటున్నారు.మ‌రి చంద్ర‌బాబు ఏం చేస్తారో చూడాలి.

తాజా వార్తలు