వైరల్: ఇలాంటి హైటెక్ ఆటోని బహుశా మీరు చూసుండరు? సూపర్ అంటున్న ప్రయాణికులు!

అవును, ఖచ్చితంగా మీరు అలాంటి హైటెక్ ఆటోని బహుశా చూసుండరు.ఆ ఆటో ప్రస్తుతం బెంగళూరు సిటీ రోడ్లపై పరుగులు పెడుతోంది.

ప్రయాణికులకు అట్రాక్ట్ చేయడానికి ఆటో డ్రైవర్ తన ఆటోని డిఫరెంట్‌గా తయారు చేయడం ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని చూడవచ్చు.ఎవరికీ రాని ఐడియా ఇక్కడ ఆటో డ్రైవర్ కి రావడం కొసమెరుపు.

వేసవి కావడంతో కస్టమర్లు ఇబ్బంది పడకుండా పయనించడానికి ఆటో వెనుక భాగంలో కూలర్( Cooler ) అమర్చి అందర్నీ ఆకట్టుకున్నాడు ఈ ఆటో డ్రైవర్.అంతేనా, ఈ హైటెక్ ఆటో సంగతులెన్నో వున్నాయి.

ఈ ఆటోలో గాజు కిటికీలు, 2 ఫ్యాన్లు, ఖరీదైన సీట్లు వున్నాయి.అచ్చం ఇది ఓ కారు మాదిరి ఉండడం ఇక్కడ గమనించవచ్చు.

Advertisement

అంతేకాకుండా ఈ ఆటో వెనకభాగాన దివంగత నటులు శంకర్ నాగ్, పునీత్ రాజ్ కుమార్ ( Puneeth Rajkumar )పోస్టర్లు కూడా ఉండడం చూడవచ్చు.స్టీరింగ్ వీల్ పక్కన ఒక రకమైన డిజిటల్ స్క్రీన్, దానిపైన డెస్టినేషన్ టెక్స్ట్ స్క్రోల్ అవుతూ ఉండడం చూడవచ్చు.ఆటో రంగు రంగుల లైట్లతో మెరిసిపోతోంది.

ట్విట్టర్ యూజర్ అజిత్ సహాని ఈ వీడియోని షేర్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది."హలో బెంగళూరు! ఎంత అందమైన ఆటో.ఎవరైనా దీనిలో ప్రయాణించారా?" అనే శీర్షికతో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

కాగా, దీనిపై నెటిజన్లు అనేకరకాలుగా స్పందిస్తున్నారు.ఆటో డ్రైవర్ ( Auto driver )కాంటాక్ట్ నంబర్ కావాలని.బెంగళూరు వాళ్లు ఏం చేసినా గర్వంగా ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తే, ఈ ఆటోవాలా బీ టెక్ చేసివుంటాడు.

అందుకే ఆ క్రియేటివిటీ! అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.మరికొంతమందైతే బెంగుళూరు వచ్చినపుడు ఆ ఆటోవాలాని కలిసి తాము ఓ సెల్ఫీ అడుగుతామని కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు.

సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ అయిన స్టార్స్ ఎవరో తెలుసా..?

మొత్తంగా చెప్పాలంటే ఇక్కడ ప్రయాణికులను ఆకర్షించడానికి ఆటో డ్రైవర్లు కూడా సరికొత్త క్రియేటివిటీతో ముందుకు వెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు.

Advertisement

తాజా వార్తలు