వైరల్: అసోంలో బీభత్సం సృష్టించిన టోర్నడోని చూస్తే మీరు నోరెళ్లబెడతారు!

టోర్నడోలు ఎంతటి బీభత్సం సృష్టిస్తాయో అందరికీ తెలిసిందే.

అయితే అపుడప్పుడు కొన్ని రకాల టోర్నడోలు మాత్రం ఎంతటి వలయ తాండవం చేస్తాయో మానవాళి ఊహకు అందదు.

ఇకపోతే ఇలాంటివి తరచూ అమెరికా రాష్ట్రాల్ని వణికిస్తుంటాయి.అలాగే అప్పుడప్పుడు ఇండియాలో కూడా సంభవిస్తున్నాయి.

ఇక్కడ ముఖ్యంగా అసోం రాష్ట్రంలో ఇలాంటి విపత్తులను చూడవచ్చును.తాజాగా అసోం, బార్‌పేట జిల్లాలో టోర్నడో ఏర్పడింది.

తీవ్ర ఒత్తిడితో కూడిన టోర్నడో.వరి పొలాలు, పలు గుడిసెలను సైతం ధ్వంసం చేసింది.

Advertisement

ఇకపోతే తమ ప్రాంతంలో ఈ రకమైన టోర్నడో ఎప్పుడూ రాలేదని, ఈ రకమైన బీభత్సం కలగడం మొదటి సారని అక్కడి స్థానికులు చెబుతూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.దాంతో పలువురు స్థానికులు ఈ టోర్నడో కి సంబందించిన ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా.

అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.ఇక గౌహతిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వద్ద వాతావరణ శాస్త్ర డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ ఓనీల్ షా మాట్లాడుతూ.

"అసోంలోని బార్‌పేటలోని చెంగాను శనివారం భయంకరమైన టోర్నడో తాకింది.ఇది తుఫాను మాత్రం కాదు!" అని తెలిపారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ దీని తీవ్రత కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అన్నారు.అయితే దీని తాకిడి వలన వరి పంట నష్టంతో పాటు కొన్ని గుడిసెలు కూలిపోయినట్లు తెలిపారు.ఇకపోతే, గత నెలలో అసోంలో అనేక తీవ్రమైన తుఫానులు మరియు పిడుగులు సంభవించిన సంఘటనలు అనేకం మనం చూశాం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 8, బుధవారం 2023

ఈ పిడుగులు లేదా తుపాను కారణంగా అసోం రాష్ట్రంలో కనీసం 18 మంది మరణించి ఉంటారని సమాచారం.అయినప్పటికీ, ఈ రాష్ట్రంలో వర్షపాతం సగటు ఇప్పటికీ సీజన్ యొక్క సగటు వర్షపాతం కంటే చాలా తక్కువగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు