Viral Video : వీడియో: ట్రాఫిక్‌లో ఈ మహిళ ఏం చేసిందో చూస్తే అవాక్కవుతారు..

నేటి ఉరుకుపరుగుల ప్రపంచంలో చాలామంది క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు.ఇక వర్కింగ్ ఉమెన్ అయితే బోల్డన్ని పనులు చేయాల్సి వస్తోంది.

దానివల్ల వారికి అస్సలు టైమ్‌ మిగలడం లేదు.ఉన్న టైమ్ నే వాళ్లు సద్వినియోగం చేసుకుంటున్నారు.

మహిళలు ( Women ) సమయాన్ని ఎంత తెలివిగా ఉపయోగించుకుంటారో చూపించే వీడియో తాజాగా వైరల్ గా మారింది.ఆ వీడియోలో ఒక మహిళ ట్రాఫిక్ జామ్‌లో( Traffic Jam ) ఇరుక్కుంది.

ఆమెతో పాటు చాలామంది వాహనదారులు త్వరగా ట్రాఫిక్ క్లియర్ అయిపోతే వెళ్ళిపోదామని వెయిట్ చేస్తున్నారు.అయితే ఆ మహిళ మాత్రం అలా చేయలేదు.

Advertisement

ఖాళీగా కూర్చోవడానికి బదులుగా తన బ్యాగులో తీసుకెళ్తున్న కూరగాయలను( Vegetables ) బయటకు తీసింది.అనంతరం తన స్కూటీ సీటు పై పేపర్ పెట్టి కూరగాయలను కట్ చేయడం మొదలుపెట్టింది.ఇంటికి వెళ్లి కిచెన్ లో కట్ చేయాల్సిన కూరగాయలను ఆమె రోడ్డు మీదే ట్రాఫిక్ లో ఉండి ఆ పని చేసింది.

అలా కిచెన్ లో చేయాల్సిన పనిని రోడ్డుపైనే చేసేసి టైం సేవ్ చేసుకుంది.ఇది చూసిన మిగతా వాహనదారులు అవాక్కయ్యారు.పాపం ఆమెకు టైమ్‌ లేదేమో అని మరికొంతమంది సానుభూతి చూపారు.

ఏది ఏమైనా ట్రాఫిక్ లో ఇలా నిల్చొని కూరగాయలు కట్ చేయాలని ఆమెకు వచ్చిన ఐడియా అదుర్స్ అని చెప్పుకోవచ్చు.

రోడ్డుపై ఆమె చేస్తున్న ఈ పనిని చాలామంది వీడియో తీశారు.ఒక ఇన్‌స్టాగ్రామ్ ( Instagram ) లో ఈ వీడియో షేర్ చేయగా అది విస్తృతంగా వైరల్ గా మారింది.చాలామంది ఈ మహిళకు వచ్చిన ఐడియా చూసే నోరెళ్ల బెడుతున్నారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

ఒకవేళ ఆమె దగ్గర పోయ్యి ఉన్నట్లయితే అక్కడే కూర కూడా చేసేవారేమో అని మరికొందరు సరదాగా కామెంట్లు చేశారు.సమయాన్ని ఎలా వాడుకోవాలో ఏమని చూసి నేర్చుకోవాలని మరికొందరు అన్నారు.

Advertisement

తాజా వార్తలు