వైరల్ వీడియో: అసాధారణ రీతిలో కత్తిని, కర్రను తిప్పుతూ ఔరా అనిపిస్తున్న మహిళ..!

ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రపంచంలో ఏ మూలన ఏ సంఘటన జరిగినా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అతి తక్కువ సమయంలో ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవడం చాలా సులువైపోయింది.

ఇందులో అనేక రకాల వీడియోలు ఫోటోలు వైరల్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం.

అందులో కొన్ని వీడియోలు మాత్రం ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ప్రపంచ దేశాల్లో మహిళ శక్తిసామర్థ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

మగవారికి దీటుగా ఆడవారు అన్ని రంగాలలో వారి ప్రతిభను చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నారు.కొంతమంది మహిళలు పురాతన విధ్యలైన కత్తిసాము, కర్రసాము లో ఎంత ప్రతిభను కలిగి ఉన్నారు.

Advertisement
Viral Video Woman Doing Stunts With Sword And Stick In An Unexpected Way , Vira

ఇలా ప్రతిభ కలిగిన ఓ మహిళ తాజాగా చీరకట్టులో చేసిన కర్రసాము, అలాగే కత్తిసాము ప్రదర్శన నెటిజెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఆ మహిళకు సంబంధించి వీడియో చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

ఓ మహిళ సాంప్రదాయమైన చీరకట్టులో కత్తిసాము కర్రసాము చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Viral Video Woman Doing Stunts With Sword And Stick In An Unexpected Way , Vira

ఎవరూ ఊహించని రీతిలో కత్తిని అలాగే తిప్పడం చూస్తే నిజంగా ఆశ్చర్యపోవడం మన వంతు అవుతుంది.ఆ మహిళ మొదట కర్రను చేతబట్టి ఆపకుండా గిరగిరా తిప్పి ఆ తర్వాత మరికొద్దిసేపట్లో కత్తి ని కూడా అదే రీతిలో చెప్పడం చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే.ఆ మహిళ ప్రదర్శన చేస్తున్న సమయంలో చుట్టూ అనేక మంది ప్రజలు గుమిగూడి ఆమె ప్రదర్శనను తనివితీరా చూసి ఆశ్చర్యపోయారు.

ఈ ప్రదర్శనకు సంబంధించి భారతదేశంలోని ఐపీఎస్ అధికారి తన సోషల్ మీడియా ద్వారా అమేజింగ్ " దేశీ మార్షల్ ఆర్ట్స్" అంటూ ప్యాసింజర్ చేసి పోస్ట్ చేశారు.దీంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ కామెంట్స్, లైకుల వర్షం కురుస్తుంది.

చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయా..? అయితే ఈ అలవాట్లు మానేయండి..
Advertisement

తాజా వార్తలు