వైరల్ వీడియో: వీళ్ళ అసలు పేరెంట్స్ ఏనా.. ఇంట్లో మంటలు చిలరేగిన..?!

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూనే ఉంటాయి.అందులో ఎక్కువగా నవ్వు తెప్పించే వీడియోలు కనపడుతుంటాయి.

మరికొన్ని భయభ్రాంతులకు గురి చేసే వీడియోలు కూడా కనబడుతుంటాయి.ఇంకొన్ని జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు ప్రతిరోజు వైరల్ గా మారుతుంటాయి.

ఇకపోతే తాజాగా వైరల్ గా మారిన వీడియోలు ఓ పిల్లాడు తన సమయస్ఫూర్తిని ఉపయోగించి పెను ప్రమాదం నుండి కుటుంబాన్ని రక్షించాడని చెప్పవచ్చు.ఇక ఈ వీడియో సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.

వీడియో లో గమనించినట్లయితే ఓ పిల్లోడు ఒక్కడు ఇంట్లో ఒకవైపు తిరిగి ఎదురుగా కూర్చుని టీవీ చూస్తూ ఉంటాడు.మరోవైపు కుటుంబ సభ్యులందరూ మరోవైపు ఓ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని ఏదో పార్టీ చేసుకుంటూ ఉంటారు.అయితే ఆ సమయంలో అనుకోకుండా స్విచ్ బోర్డు( Switch board ) నుంచి మంటలు రావడం జరుగుతుంది.

Advertisement

దాంతో వెంటనే ఆ చిన్నారి భయభ్రాంతులకు లోన్ అయ్యి పక్కనే ఉన్న తన కుటుంబ సభ్యుల దగ్గరికి అక్కడ మంటలు వస్తున్నాయని చెప్పడానికి వెళ్ళాడు.అయితే వారందరూ పార్టీ మూడు లో ఉండడంతో పిల్లాడు చెప్పేది వినకుండా వాళ్ళ పార్టీలో మునిగిపోయాడు.

దాంతో పిల్లాడు చేసేదేమీ లేక మళ్ళీ టీవీ దగ్గరికి వచ్చి అక్కడే ఉన్న ఓ స్ప్రే బాటిల్ ( spray bottl e )ని తీసుకొని మంటపై స్ప్రే చేశాడు.దాంతో వెంటనే ఆ అగ్ని జ్వాలలు ఆరిపోయాయి.

దాంతో నిజంగా పెను ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు.

ఇక ఈ వీడియోని చూసిన చాలామంది నెటిజెన్స్ వారి కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎంత పార్టీ మూడులో ఉంటే మాత్రం పిల్లాడు చెప్పేందుకు వస్తే కాస్త కూడా వినిపించుకోరా అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా., మరికొందరైతే వారు అసలు తల్లితండ్రులకు పనికొస్తారా అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియో ని ఒకసారి వీక్షించండి.

Advertisement

తాజా వార్తలు