వైరల్ వీడియో: అది తాడు కాదు తల్లి.. పాము! జాగ్రత్త సుమీ..

సామాన్యంగా పాములు( Snakes ) కనిపిస్తేనే చాలా మంది భయంతో వణికిపోతారు.

పాములు ఉన్న ప్రదేశాల్లో ఉండటమే కాదు, అక్కడికి వెళ్లేందుకు కూడా చాలా మంది ఆసక్తి చూపరు.

చెట్లు, పొదలు, గుట్టల వంటి ప్రదేశాల్లో ఎక్కువగా పాములు కనిపిస్తాయి.ఎలుకలు ఎక్కువగా ఉన్నచోట పాముల సంచారం కూడా అధికంగా ఉంటుంది.

అయితే, ఇటీవలకాలంలో పాముల వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్( Viral Video ) అవుతున్నాయి.సోషల్ మీడియాలో పాముల వీడియోలను ఆసక్తిగా చూసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

ఒకవైపు పాములను చంపాలనే వారికి కొందరు అడ్డుకుంటే, మరోవైపు పాములను రక్షించే స్నేక్ క్యాచర్లు( Snake Catchers ) ఎంతో చాకచక్యంగా వాటిని పట్టుకుని అటవీ ప్రాంతాల్లో విడిచిపెడుతున్నారు.పాములు కనిపిస్తే కొంత మంది స్నేక్ రెస్క్యూయర్లకు సమాచారం అందిస్తే, మరికొందరు వాటిని హింసించడానికి వెనుకాడటం లేదు.

Advertisement
Viral Video Girl Holds And Plays With Snake Details, Viral Video, Snake Catching

అయితే, కొందరు పాములను చంపితే "కాలసర్ప దోషం" అంటుందని భయపడిపోతున్నారు.

Viral Video Girl Holds And Plays With Snake Details, Viral Video, Snake Catching

సాధారణంగా పాములను పట్టుకోవడం అంటే పురుషులే చేస్తారని భావించేవారు.కానీ, ప్రస్తుతం కొంతమంది యువతులు కూడా పాములను ఎంతో నేర్పుగా పట్టుకుంటున్నారు.ఇటీవల నెట్టింట్లో వైరల్ అయిన వీడియోలో, ఒక యువతి( Woman ) పామును ఎంతో ధైర్యంగా పట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.

వీడియోలో కనిపించిన యువతి, అదేదో తాడును పట్టుకున్నంత ఈజీగా పామును చేతిలో పట్టుకుంది.ఆమెకు భయమేమీ లేకుండా, పామును తన చేతిలో చక్కగా ఆడించింది.అంతేకాదు, పామును ఎంతో ప్రేమగా చూసి,దానితో ముద్దుపెట్టుకున్నంత పనిచేసింది.

Viral Video Girl Holds And Plays With Snake Details, Viral Video, Snake Catching

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.ఏంట్రా అమ్మాయి.పామును తాడులా పట్టుకున్నదే! అని షాక్ అవుతున్నారు.

భారతీయులకు అమెరికాలో గ్రీన్ కార్డు పై కొత్త సవాళ్లు?
ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. 'ఎక్స్'ను అమ్మేశాడంట తెలుసా?

మరికొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకోగా, మరికొందరు మాత్రం సరదాగా ఈమెను పెళ్లిచేసుకునే వాడు ధైర్యశాలి అయి ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ వైరల్ వీడియోలో యువతి ప్రదర్శించిన ధైర్యం, కొంత మందిని ఆశ్చర్యానికి గురిచేయగా, కొంత మందిని భయపెట్టేసింది.

Advertisement

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది.మీరు కూడా ఈ వీడియో చూసారా?.

తాజా వార్తలు