వైరల్ వీడియో: ఎలుగుబంటి దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు..!

ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media ) సహకారంతో ప్రతిరోజు ప్రపంచంలో ఏం జరుగుతున్న ఆ విషయాన్ని అతి తక్కువ సమయంలో అన్ని విషయాలను తెలుసుకోగలుగుతున్నాము.

ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి.

అందులో కొన్ని నవ్వును తెప్పించే వీడియోలు ఉంటే.కొన్ని అయితే భయం కలిగించే వీడియోలు కూడా ఉంటాయి.

మరికొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారుతుంటాయి.తాజాగా ఎలుగుబంటి( Bear ), పెద్దపులికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

Advertisement

అడవుల్లో నివసించే క్రూరముగాల్లో పెద్ద పులి( Tiger ) కూడా ఒకటి.అడవుల్లో ఉన్న జంతువులు పెద్దపులి ఎదురైతే.ఆ చుట్టుపక్కల ఉండకుండా అవి అదృశ్యం అవుతాయి.

ఒక ఎలుగుబంటి తప్పించి.అయితే నిజానికి ఎలుగుబంటి కి ఒకవేళ కోపం వస్తే మాత్రం ఎదురుగా ఎంత పెద్ద జంతువు అయినా సరే దానికి దెబ్బకు పరిగెత్తాల్సిందే.

తాజాగా ఇలాంటి సంఘటనకు మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ కోర్( Tadoba Tiger Reserve Core ) ఏరియాలో సంభవించింది.రిజర్వ్ ఫారెస్ట్ లో కల్వర్టు దగ్గర ఉన్న నీటిగుంటలో ఎలుగుబంటి ఉంది.

ఆ ఎలుగుబంటి దగ్గరికి ఓ పెద్దపులి రావడాన్ని ఎలుగుబంటి గమనించింది.అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.ఎలుగుబంటి సడన్ గా లేచి పెద్దపులి వైపు నడుచుకుంటూ వెళ్లి ఎదురుగా నిలబడింది.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..

అంతటితో ఆగకుండా పెద్దపులి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఎలుగుబంటి చూడగా.భయంతో పెద్దపులి అక్కడి నుంచి పరుగులు పెట్టింది.

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో( Viral Video ) సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను రిజర్వ్ ఫారెస్ట్ చూడానికి వచ్చిన పర్యాటకులు వారి కెమెరాలో బంధించడంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తాజా వార్తలు