వైరల్: కొంగతో ఫ్రెండ్ షిప్ చేస్తోన్న కుర్రాడు... నెటిజన్లు ఫిదా!

సోషల్ మీడియాలో అనునిత్యం రకరకాల వీడియోలు అప్లోడ్ అవుతూ అవుతుంటాయి.అయితే అందులో ఏ కొన్నో జనాలను మెప్పిస్తూ ఉంటాయి.

అలా మెప్పించిన వీడియోలు తెగ వైరల్ అవుతూ ఉంటాయి.అలా ఒక వీడియో వైరల్ కావాలంటే దానిలో ఏదోఒక ప్రత్యేకత ఉండి తీరాలి.

లేదంటే ఎవరూ పట్టించుకోరు.ఇపుడు అలాంటి ఒక వీడియో గురించి మాట్లాడుకుందాం.

ఓ వ్యక్తి కొంగతో స్నేహం చేస్తున్నాడు.అవును, దానికి సంబంధించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

దాంతో రియల్ ఫ్రెండ్ షిప్ అంటే అదే అంటూ నెటిజన్లు అతగాడిని ఎత్తేస్తున్నారు.ఈ ఆత్మీయ స్నేహం కథ ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ ప్రాంతంలో జరిగింది.

ఔరంగాబాద్‌లోని గౌరీగంజ్ గ్రామం మాండ్‌ఖా మజ్రేలో నివసిస్తున్న ఒక వ్యక్తికి కొంగతో ఎప్పటినుండో బలమైన స్నేహం ఉంది. మహ్మద్ ఆరిఫ్ పొలాల్లో గాయాలతో పడి ఉన్న కొంగను చూసి తన ఇంటికి తీసుకొచ్చి సపరిచర్యలు చేసాడు.

ఈ క్రమంలో దానికి చికిత్స చేసిన ఆహారం అందించాడు.అనంతరం దానిని అడవి ప్రాంతంలో వదిలేందుకు తీసుకెళ్లాడు.

కానీ, ఆ పక్షి అడవి వైపు వెళ్లకుండా ఆరీఫ్ వైపే పయనించింది.అంతలాగ వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది.అరిఫ్ బైక్ మీద ఎక్కడికి వెళ్తున్నా ఆ కొంగ కూడా అతడిని ఇపుడు అనుసరిస్తూ వెళ్తోంది.

How KYC, Fast Payouts And Self‑Exclusion Work For Crypto Users At WPT Global (Canada)
Roulette Lightning : A Revolution In A Classic Game — RNG ...

కాగా వారి స్నేహానికి సంబంధించిన కొన్ని వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా లక్షల్లో దానిని చూసి లైక్స్ కొడుతున్నారు.అలాగే, ఈ స్నేహాన్ని చూసి, చాలా మంది నెటిజన్లు తమ మనసులోని మాటలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

Advertisement

"ద్వేషపూరిత ఈ ప్రపంచంలో ఇటువంటి దృశ్యాలు చూసిన తరువాత ప్రపంచంలో ఇంకా ప్రేమ మిగిలే ఉండదన్న విషయం బాధపడుతోంది" అని కామెంట్ చేస్తున్నారు.