వైరల్ పోస్ట్: తప్పిపోయిన పెంపుడు చిలుక కోసం భారీ ఆఫర్ ప్రకటించిన యజమాని..!

మనుషులు ఎక్కడైనా తప్పిపోతేనో.లేక ఇంట్లో నుండి చెప్పకుండా వెళ్ళిపోతేనో వారు ఎక్కడ ఉన్నారో.

ఎలా ఉన్నారో అని తెలుసుకోవడానికి కనపడుట లేదు అని ప్రకటన ఇవ్వడం మనం చూసుంటాం.కానీ వీటికి భిన్నంగా ఓ వ్యక్తి మాత్రం తాను పెంచుకుంటున్న పెంపుడు చిలక కనిపించడం లేదని ఏకంగా ఓ ప్రకటన ను ఇచ్చాడు.

అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.వివరాల్లోకి వెళ్తే.

బీహార్ లోని గయకు చెందిన శ్యామ్‌దేవ్ ప్రసాద్ గుప్త, సంగీతాలు ఓ చిలుకను పెంచుకుంటున్నాడు.దాన్ని ఇంట్లో మనిషి వలె అపురూపంగా చూసుకునేవాడు.

Advertisement

కాగా, ఓ రోజు తాన పెంపుడు చిలుక కనపడకుండా పోయింది.దాని కోసం వెదకని చోటు లేదు.

చిలుకమ్మ కోసం తిండి నిద్ర మాని మరీ వెదికారు.దీంతో తాను పెంచుకుంటున్న చిలుక కనపడడం లేదని పోస్టర్లను ను ప్రింట్ చేయించి ఊరంతా రోడ్డు వెంబడి ఉన్న గోడలకు వాటిని అంటించాడు.

పోస్టర్ లో తను పెంచుకుంటున్న చిలక ఫోటోను కూడా వేశాడు.మేము ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిలుక కనబడడం లేదని.

చిలక దొరికితే చెబితే రూ. 5100 రివార్దును కూడా ఇస్తామని తెలిపారు.దాని ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023

అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

12ఏళ్లుగా చిలుకను పెంచుకుంటున్నామని, ఏప్రిల్ 5న ఇంట్లోంచి వెళ్లిపోయిందని శ్యామ్ ప్రసాద్ దంపతులు చెబుతున్నారు.మా చిలుకమ్మను ఎవరు తీసుకెళ్లారో, వారికి ఇంకో చిలుక కొనిస్తాము మాకు ఇవ్వండి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఆ చిలుక దొరుకుతుందో లేదో చూడాలి.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పై నెటిజన్లు తమదైన శ్రేణిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.మనుషులనే పట్టించుకోని ఈ రోజుల్లో చిలుక మీద ఇంత ప్రేమ చూపిస్తున్న నీకు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు