వైర‌ల్‌.. డ్యాన్స్ అద‌ర‌గొట్టేస్తున్న పెంపుడు కుక్క‌

ఒక‌ప్పుడు ఇల్లు అంటేనే అంద‌రికీ అందులో మ‌నుషులు మాత్ర‌మే గుర్తుకు వ‌చ్చేవారు.కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి.

కాలం మారుతున్నా కొద్దీ మ‌నుషుల అల‌వాట్లు, వ్య‌వ‌హారాలు మారుతున్నాయి.ఇప్పుడు ప్ర‌తి ఇంట్లో పెంపుడు జంతువులు క‌నిపిస్తున్నాయి.

నిజం చెప్పాలంటే అవి కూడా ఇంట్లో మ‌నిషిలాగే అయిపోయాయి.కుటుంబ స‌భ్యుడిలా దానికి కూడా అన్నీ తీసుకురావాలి.

అన్ని స‌ప‌ర్య‌లు చేయాలి.పైగా మ‌నుషుల్లాగే అవి కూడా ప్రేమ‌, అనుబంధాల‌ను పెన‌వేసుకుంటున్నాయి.

Advertisement
Viral Pet Dog Going Viral With Its Dance Moves, Viral Video, Dog Dance, Pet Dog

ఇక కొన్ని అయితే అద్భుత‌మైన ట్యాలెంట్ ను కూడా నేర్చుకుంటున్నాయి.మ‌నుషులు చేసిన‌ట్టే కొన్ని ప‌నులు చేస్తున్నాయి.

త‌మ జాతి కుక్క‌లు చేసే ప‌నులు కాకుండా మ‌నుషులు చేసే ప‌నులే చేస్తున్నాయి.పొద్దున్నే లేచి వాకింగ్ కు వెళ్ల‌డం, మార్నింగ్ స్నాక్స్ లాంటివి తిన‌డం, టైమ్‌కు భోజనం చేయ‌డం లాంటివి చేస్తున్నాయి.

అయితే ఈ న‌డుమ కొన్ని పెంపుడు కుక్క‌లు ఆన్ లైన్ లో గేమ్స్ కూడా ఆడేస్తున్నాయి.ఇంకొన్ని అయితే అద్భుతంగా వ్యాయామాలు కూడా చేసేస్తున్నాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వండ‌ర్ కుక్క గురించి తెలుసుకుందాం.అది అద్భుతంగా డ్యాన్స్ చేసేస్తుందండోయ్‌.

Viral Pet Dog Going Viral With Its Dance Moves, Viral Video, Dog Dance, Pet Dog
ఫూల్ మఖనా తినడం వలన ఇన్ని లాభాలు ఉన్నాయా..?

ప్ర‌స్తుతం నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతున్న ఓ వీడియోలో కుక్క సూప‌ర్ గా డ్యాన్స్ చేసేస్తోంది.ఎంత‌లా అంటే ఏకంగా డ్యాన్స్ కింగ్ మైకేల్ జాక్సన్ తోనే పోటీ ప‌డుతోందా అన్న‌ట్టు ఎంతో కష్టపడింది.ఇక దీన్నంతా కూడా ఆ కుక్క ఓన‌ర్లు వీడియో తీసి సోస‌ల్ మీడియా ఖాతాలో షేర్ చేయ‌గా నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకుంటోంది.

Advertisement

ఈ కుక్క‌కు ఇంత ట్యాలెంట్ ఏంట్రా బాబు అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.ఇంకొంద‌రు అయితే త‌మ‌కు కూడా అలా డ్యాన్స్ వ‌స్తే బాగుండు అంటూ నిరాశ‌గా మీమ్స్ పెడుతున్నారు.

మ‌రి మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు