వైరల్: ఓ ఏనుగు చెరకు ట్రక్‌ను ఆపి ఏం చేసిందో తెలుసా?

సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు పోస్ట్ అవుతూ ఉంటాయి.అందులో కొన్ని చాలా సరదాగా అనిపిస్తే, మరికొన్ని చాలా ఆశ్చర్యంగా ఉంటాయి.

కొన్ని చూడడానికి వింతగా అనిపిస్తే.మరికొన్ని చాలా జుగుప్సను కలిగిస్తాయి.

అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే చాలా ఫన్నీగాను, కాస్త భయం గాను అనిపించక మానదు.వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనించినట్లయితే ఓ హైవేపై వెళుతున్న‌ చెర‌కు ట్ర‌క్‌ను రోడ్డు పక్కనే వున్న ఏనుగు గమనించి ఫాలో చేయడం చూడవచ్చు.

అక్కడితో ఆగుతుందా అంటే పొరపాటే.సదరు ట్రక్ సమీపించగానే ఏనుగు దానికి అడ్డంగా వెళ్లి నిలుస్తుంది.ఇక ఆ ట్రక్ డ్రైవర్ ఇక చేసేదేమిలేక వాహనాన్ని ఆపుతాడు.

Advertisement

వెంటనే ఆ ఏనుగు ఆ ట్రక్ పైన వున్న చెరకు లోడుని తన తొండంతో బలంగా కిందికి లాగుతుంది.దాంతో ఒక కట్ట కింద పడుతుంది.ఇంకేముంది, కట్ చేస్తే.

అక్కడ పడి వున్న చెరకు గడలని ఆ ఏనుగు కరకరా నమిలేస్తుంది.వీడియోలో చూపిన సైన్‌బోర్డ్ ఆధారంగా థాయ్‌లాండ్‌లో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది.

డా.అజ‌యిత ఈ వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ ఆ వీడియోకి 2.95 ల‌క్ష‌ల‌కు పైగా వ్యూస్ రావడం కొసమెరుపు.కాగా ఈ వీడియో నెటిజ‌న్ల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది.

ది టోల్ ట్యాక్స్ క‌లెక్ట‌ర్ అని ఈ వీడియోకు క్యాప్ష‌న్ ఇవ్వడం గమనించవచ్చు.అయితే ఇక్కడ ఏనుగు ట్ర‌క్కుపై దాడి చేయ‌కుండా తన ఆక‌లి మాత్రమే తీర్చుకోవడానికి కొంత చెర‌కును తీసుకోవ‌డం నెటిజ‌న్ల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

రాత్రి పడుకునే ముందు పెరుగన్నం తింటే ఏమవుతుందో తెలుసా?

ఈ ఏనుగు చాలా తెలివైంద‌ని.ఎలిఫెంట్ క్రాసింగ్ అనే బోర్డు వ‌ద్దే నిలుచుంద‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేయడం ఇక్కడ గమనించవచ్చు.

Advertisement

తాజా వార్తలు