వైరల్: రోజురోజుకి డిమాండ్ పెరుగుతున్న ఖర్జూర కల్లు..!

మనలో చాలా మంది తాటి కల్లు, ఈత కల్లు గురించి వినే వుంటారు కానీ, ఇప్పుడు మాత్రం ఎక్కువుగా ఖర్జూరం కల్లు గురించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఎంతలా అంటే.

ఈ కల్లు ఖర్జురం చెట్ల మీద నుంచి ఇంకా అమ్మకానికి రాకుండానే ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేటంత డిమాండ్ సొంతం చేసుకుంది.ఈ కల్లు లీటర్ రూ.500 ఖరీదైన సరే సొంతం చేసుకుని తాగడానికి ఇష్టపడుతున్నారు.మరి అంతలా ఈ ఖర్జూర కల్లు జనాలు ఎందుకు ఎగబడుతున్నారో చూద్దాం.

తెలంగాణ లోని నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలంలో టర్నికల్ అనే గ్రామంలో ఎక్కువ మంది ఖర్జూర కల్లును తాగడానికే ఇష్టపడుతున్నారు.తాటి కల్లు, ఈత కల్లు కంటే ఖర్జుర కల్లులో ఆల్కహాల్ శాతం తక్కువుగా ఉండడంతో అతిగా మద్యం సేవించే అలవాటు ఉన్నవారికి ఈ కల్లు తాగితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని ఆబ్కారీ అధికారులు అంటున్నారు.

అందుకనే అతిగా మద్యం సేవించేవారు కాకుండా కల్లు తాగాలనుకునే వారు మాత్రమే ఖర్జూర కల్లును సేవిస్తున్నారని అంటున్నారు.ఇక ఉన్నత వర్గానికి చెందిన వారు కొందరు ముందే ఆర్డర్ చేసి మరీ కల్లును తీసుకెళ్తున్నారట.

Advertisement

ఇందులో ఆల్కహాల్ 4 నుంచి 6 శాతం ఉంటుందని అబ్కారీ శాఖ అధికారులు చెప్పారు.అలాగే ఈ కల్లుకి వాసన సైతం ఉండదట.మరోవైపు ఖర్జూర కల్లులో ఆల్కహాల్ శాతం తక్కవే అయినందున ఆరోగ్యానికీ ఎలాంటి ప్రమాదం ఉండదంటున్నారు.

ఖర్జూరంతో ఆరోగ్యానికి ఎంత ప్రయోజనమో, ఆ చెట్టు నుంచి వచ్చే కల్లూ అంతే ఆరోగ్యమని వారు చెబుతున్నారు.ఏదిఏమైనా ఈ కొత్తరకం కల్లు ఇప్పుడు ట్రెండ్ గా మారింది.

Advertisement

తాజా వార్తలు