వైరల్: కొండ చిలువతో ఓ ఆటాడుకున్న వ్యక్తి... అవాక్కవుతున్న నెటిజన్లు!

సోషల్ మీడియా అనేక రకాల వీడియోలకు అడ్డాగా మారిపోయింది.అయితే అందులో ఏ కొన్నో నెటిజన్ల మనసులను దోచుకుంటాయి.

వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని చిత్రంగా ఉంటాయి.ఇంకొన్ని ఆశ్యర్యాన్ని కలిగిస్తే.

మరికొన్ని కాస్త జుగుప్సను కలిగిస్తాయి.తాజాగా వైరల్ అవుతున్న వీడియో అయితే ఒకింత జుగుప్సను కలిగించే విధంగా వుంది.

ఓ కుర్రాడు చేసిన పనికి కొందరు అవాక్కవుతున్నారు.ఏం గట్స్ రా బాబు అని మనోడిని తెగ పొగిడేస్తున్నారు.

Advertisement

కొందరు మాత్రం నీకేమైనా పిచ్చా అంటూ అక్షింతలు వేస్తున్నారు.వివరాల్లోకి వెళితే, ఓ భారీ కొండ చిలువు ఓ డ్రైనేజీలోకి ఎలా వచ్చిందో తెలియదు గాని, పెద్ద ఎత్తున వాటర్‌ ఫ్లో రావడంతో ఆ కొండ చిలువకు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిని నెలకొంది.

దీంతో నీళ్లలోనే తిరుగుతూ అలా అక్కడే చక్కెర్లు కొడుతోంది.ఇంతలోనే ఈ విషయాన్ని గ్రహించిన కొందరు యువకులు దానిని కాపడడానికి రంగంలోకి దిగారు.

తాడు సహాయంతో దానిని బయటకు తీయాలని ఓ కుర్రాడు యత్నించగా వాటర్‌ ఫ్లో ఎక్కువగా ఉండడం వలన పైథాన్‌ ఎంతకీ చిక్కలేదు.

దీంతో అక్కడే ఉన్న మరో కుర్రాడు వెంటనే రంగంలోకి దిగి చేతితోనే పామును కేవలం సెకండ్ల వ్యవధిలో పట్టేసుకున్నాడు.కొండ చిలువ మెడను గట్టిగా తన చేతిలో అదిమిపెట్టి బంధించడంతో ఆ పాము చాలా తేలికగా చిక్కేసింది.అనంతరం అవతలి వ్యక్తి పాముకు మరలా తాడును కట్టి గట్టిగా బిగించాడు.

నాగచైతన్య శోభిత ధూళిపాళ మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్.. ఎన్ని సంవత్సరాలంటే?
ఒకేసారి ఇద్దరు డాక్టర్లతో అఫైర్ పెట్టుకున్న చైనీస్ నర్స్.. చివరికి..?

ఆ తరువాత వెంటనే పామును అవతలికి పారేశాడు పట్టుకున్న వ్యక్తి.దీనంతటినీ అక్కడే ఉన్న వారు వీడియోగా తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయగా ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Advertisement

వీడియో చూసిన నెటిజన్లు కొండ చిలువను చేతితో సులభంగా పట్టిన వ్యక్తి ధైర్యానికి సలాం చేస్తున్నారు.

తాజా వార్తలు