ఈ ప్రకృతిలో ప్రతి జీవి సృజనాత్మకమైనదే.జీవి బ్రతికే క్రమంలో ఎన్నో విషయాలను నేర్చుకుంటుంది.
అయితే ఇక్కడ కేవలం మనిషే గుర్తింపబడతాడు.ఎందుకంటే ఇక్కడ జ్ఞానం వున్నది ఒక్క మనిషికే కాబట్టి.
అయితే కొన్ని జీవరాసులు చూస్తే, ముఖ్యంగా వాటి చేష్టలు చూస్తే ఔరా అనిపిస్తూ ఉంటుంది.అందులో ముఖ్యంగా మనం ఎంతో ముద్దుగా పెంచుకొనే కుక్కపిల్లలు ఐడియాలు ఒకసారి గమనించినట్లయితే చూడముచ్చట వేస్తుంది.
అవును.ఇక్కడ మీకు కనిపించే వీడియోలో కుక్కపిల్లను చూసి మనం కూడా ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు.
దాని ఆత్మ విశ్వాసం ముందు మనుషులు దిగదుడిపే అని అనిపించకమానదు.మనలో అనేకమందికి ఆత్మవిశ్వాసం కాస్త తక్కువగా ఉంటుంది.
ఓ రెండు మూడు సార్లు దేనికోసమన్నా ట్రై చేసి విసిగి వేసారిపోతూ వుంటారు.తరువాత మన వల్ల కాదు అంటూ వదిలిపెట్టేస్తారు.
అలాగే కొంతమంది.వుంటారు.
వాళ్ళు కనీసం ప్రయత్నం అనేది చేయకుండా చేయవలసిన పనిని వదిలి పెట్టేస్తారు.వారిని పిరికివారిగా పరిగణిస్తారు.
ఈ ఆత్మవిశ్వాసం.తమపై తమకు నమ్మకమనేవి కేవలం మనుషలలో మాత్రమే కాదు జంతువులలోనూ ఉంటాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే మీరు నిజమే అని అనిపించకమానదు.
ఇక్కడ పొందుపరిచిన వీడియోలో చూసినట్లయితే, ఓ చిన్న కుక్క పిల్ల చేసే ధైర్యం ఔరా అనిపిస్తుంది.ఓ పెద్ద గేటును అవలీలగా ఎక్కేసి అందరినీ ఆశ్చర్పరుస్తుంది.చూడండి.
వైరల్ అవుతున్న వీడియోలో.ఓ మైదానంలో చిన్న, పెద్ద కుక్క పిల్లలు చాలానే ఉన్నాయి.వాటి చుట్టూ ఐరన్ గేట్ కూడా అమర్చబడి ఉంది.
ఆ గేట్ నుంచి బయటకు వచ్చేందుకు ఆ కుక్క పిల్లలు ప్రయత్నిస్తున్నాయి.అయితే అందులో ఓ చిన్న కుక్కపిల్ల మాత్రం ఏకంగా ఎన్‌క్లోజర్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ పెద్ద సాహసమే చేసింది.
ఇది చూసిన కొందరు నెటిజన్లు దానికి కొనియాడుతున్నారు.ఆ పప్పీని చూసి ఆత్మస్థైర్యం తెచ్చుకోవచ్చని అంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy