వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సెటైర్ లు..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ బిజెపి టిడిపి పొత్తు ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇటీవలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం.

రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు.మోడీ అసలు చంద్రబాబుని దగ్గరికి రానివ్వరని అందరూ అనుకున్నారు.

మళ్లీ వారిద్దరు కలిశారు అని చెప్పుకొచ్చారు.ఇటువంటి తరుణంలో టీడీపీ.

బీజేపీ పొత్తు అంటూ వస్తున్నా వార్తలపై.విజయసాయిరెడ్డి సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై సెటైర్లు వేయడం జరిగింది.

Advertisement

వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబుని బిజెపి మళ్లీ చేరదీస్తుందా అన్నది బీజేపీ అంతర్గత విషయం.ఒకటి మాత్రం నిజం.

విలువల్లేని టీడీపీతో పొత్తు అనేది బిజెపి స్థాయిని తగ్గిస్తుంది.దరిద్రాన్ని ఎవరైనా కోరి చంకన పెట్టుకుంటారా? గుండె రాయి చేసుకొని భరించక తప్పదు బాబన్నా.నువ్వేం చూడకూడదు అనుకుంటావో అవే దృశ్యాలు పగబట్టినట్టు తరుముతున్నాయి.

తండ్రీకొడుకులు ఒకరినొకరు ఓదార్చుకోండి.బయటి వాళ్లు సర్ది చెప్పే విషయం కాదాయె.

రేపు కుప్పంలో ఇవే స్లోగన్లు వినిపిస్తాఏమో.అని వ్యంగ్యంగా విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ లో కామెంట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు