దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విజయ్ వారసుడు!

సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.ఇప్పటికే ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది వారసులు హీరోలుగాను దర్శకులుగాను కొనసాగుతున్నారు.

అయితే ఇండస్ట్రీలోకి మరో వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.ఈ క్రమంలోనే కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు విజయ్ (Vijay) ఒకరు.

ఈయన తెలుగు తమిళ భాషలలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి విజయ్ వారసుడు హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని అందరూ భావించారు.

ఇలా తమ హీరో వారసుడు కూడా హీరోగా వెండి తెరపై సందడి చేస్తారని భావించినటువంటి అభిమానులకు ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.విజయ్ కుమారుడుజానస్‌ సంజయ్‌ విజయ్(Janos Sanjay Vijay) దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.ఈయన దర్శకుడిగా తన మొదటి సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అగ్రిమెంట్‌ కూడా కుదుర్చుకున్నారు.

Advertisement

జాసన్‌ సంజయ్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సినిమా నిర్మిస్తున్నట్టు లైకా ప్రొడక్షన్స్ అధినేత వెల్లడించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇలా విజయ్ కుమారుడు జాసన్‌ సంజయ్‌ను హీరోగా కాకుండా దర్శకుడిగా చూడబోతున్నామనే విషయం తెలియడంతో విజయ్ అభిమానులు కాస్త నిరుత్సాహం వ్యక్తం చేశారు.ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో(Leo) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు