పుష్పలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి..!

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వస్తున్న పుష్ప గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ ను ఖుషి చేస్తుంది.

సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా స్పెషల్ సాంగ్ లో మరో హాట్ భామ నర్తిస్తుందని అంటున్నారు.

ఇక ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా ఇంపార్టెంట్ రోల్ లో కనిపిస్తారని టాక్.సినిమాలో విజయశాంతి కనిపించేది కొన్ని సీన్స్ మాత్రమే అయినా సినిమాలో ఆమె పాత్ర హైలెట్ గా ఉంటుందని అంటున్నారు.

చాలా రోజుల తర్వాత మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించిన విజయశాంతి రీ ఎంట్రీ తర్వాత సెలెక్టెడ్ సినిమాలు చేస్తుంది.పుష్ప సినిమాలో విజయశాంతి పాత్రని చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారని తెలుస్తుంది.

సినిమాలో ఆమె ఉంటుందన్న విషయాన్ని చిత్రయూనిట్ దాచిపెట్టగా విజయశాంతి న్యూస్ బయటకు వచ్చేసింది.ప్రస్తుతం పుష్ప పార్ట్ 1 ది రైజ్ డిసెంబర్ 25న క్రిస్ మస్ రోజున రిలీజ్ ప్లాన్ చేశారు.

Advertisement

సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టబోతున్నాడని అంటున్నారు.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని టాక్.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు