నెల్లూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసిన విజయసాయి రెడ్డి..!!

నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ( Vijayasai Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిసిన విజయసాయి రెడ్డి టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి( TDP Candidate Vemireddy ) నామినేషన్ అంశంపై ఫిర్యాదు చేశారు.

అయితే తమ ఫిర్యాదును ఎన్నికల అధికారి తిరస్కరించారని విజయసాయి రెడ్డి తెలిపారు.ఈ క్రమంలో న్యాయ నిపుణులను సంప్రదించి ముందుకు వెళ్తామని చెప్పారు.

విదేశాల్లో ఉన్న పెట్టుబడులు, ఆస్తులను అఫిడవిట్ లో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పేర్కొనలేదని తెలిపారు.దేశంలో ఉన్న ఆస్తుల్లో కొన్నింటిని పొందుపరచలేదన్నారు.వివిధ కంపెనీల్లో ఉన్న షేర్లనూ వేమిరెడ్డి పొందుపరచలేదని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై లీగల్ గా ముందుకు వెళ్తామని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)