ఇక షర్మిలతోనే విజయమ్మ ..! వైసీపీ కి రాజీనామా

వైసిపి ప్లీనరీ సందర్భంగా ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సుదీర్ఘ ప్రసంగం చేశారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత తమ కుటుంబం ఎన్నిరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నాయో వివరించారు.

జగన్ టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ వేధింపులకు దిగడం , అక్రమ కేసులు దగ్గర నుంచి షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడం తదితర విషయాలన్నిటిపైన విజయమ్మ భావోద్వేగ ప్రసంగం చేశారు.ఈ సందర్భంగా తాను వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు.

  తన పదవి విషయంలో రాజకీయ విమర్శలు తలెత్తుతున్నాయని, ముఖ్యంగా అటు తెలంగాణలో షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఇటు ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలుగా ఉండడం తగదని , అందుకే వైసీపీకి రాజీనామా చేస్తున్నానని , ప్రస్తుతం ఏపీలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారని , తెలంగాణలో త్వరలో ఎన్నికలు రాబోతుండడంతో అక్కడ షర్మిల పార్టీ ఎన్నికల బరిలో దిగుతోందని,  ఇటువంటి కష్ట సమయంలో తల్లిగా షర్మిల కు అండగా నిలవాలని తాను నిర్ణయించుకున్నట్లు వైఎస్ విజయలక్ష్మి తెలిపారు. 

తాను తెలంగాణలో షర్మిలకు అండగా నిలుస్తానని ఏపీలో జగన్ కు అండగా ప్రజలు ఉన్నారని  ఆమె ప్రసంగంలో పేర్కొన్నారు.జగన్ మాస్ లీడర్ అని ప్రశంసించారు.ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కుటుంబం తమదని చెప్పుకొచ్చారు.

Advertisement

 తన అన్నకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అనే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని పెట్టారని విజయమ్మ అన్నారు.తాను చేయని సంతకంతో వైసిపి రాజకీయ ప్రత్యర్థులు ఒక లేఖను విడుదల చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీలో రెండోసారి సీఎం గా జగన్  గెలుస్తారని  విజయమ్మ ఆకాంక్షించారు.  విజయమ్మ ప్రసంగం మొత్తం వైసీపీ శ్రేణుల్లో జోష్ పెంచింది.ఇప్పటివరకు జగన్ షర్మిల విజయమ్మ మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే విజయమ్మ షర్మిల తోనే ఉంటున్నారని జరుగుతున్న ప్రచారానికి పుల్ స్టాప్ పడినట్లు అయింది.

Advertisement

తాజా వార్తలు