గేమ్ ఛేంజర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో అతనేనా.. అందుకే రిజెక్ట్ చేశారా?

రామ్ చరణ్( Ram Charan ) శంకర్( Shankar ) కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ చేంజర్( Game Changer ) సినిమా మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఆ అంచనాలను కాస్త మరింత డబల్ చేస్తూ తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభిస్తోంది.ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సరైన హిట్టు సినిమా ఏమీ లేకపోవడంతో ఈ సినిమా కోసం చెర్రీ అభిమానులతో ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే మాత్రం ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం ఖాయం అని చెప్పాలి.ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది.అదేమిటంటే గేమ్ చేంజర్ ని మాకు ముందుగా అనుకున్న హీరో రామ్ చరణ్ కాదట.

Advertisement

హీరో విజయ్ ని( Hero Vijay ) ముందుగా ఈ సినిమాకు అనుకున్నారట.ఈ కాంబోలో 3 ఇడియట్స్ రీమేక్ నన్బన్ వచ్చింది కానీ ఆశించిన ఫలితం అందుకోలేదు.

స్ట్రెయిట్ సబ్జెక్టు ఏదైనా చేసి ఉంటే బాగుండేదని అప్పట్లో ఫ్యాన్స్ తెగ ఫీల్ అయ్యారు.ఆ టైం లోనే కార్తీక్ సుబ్బరాజ్ ఒక కథ రాసుకుని శంకర్ కు వినిపించడం, అది కాస్తా తలపతికి చేరడం జరిగిపోయాయి.

స్టోరీ నచ్చినా కూడా విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు.

దీని స్థానంలోనే బీస్ట్ ఒప్పుకున్నాడు.అలా చేయి మారిపోయి దిల్ రాజు( Dil Raju ) ద్వారా శంకర్ రామ్ చరణ్ ని కలుసుకోవడం, వెంటనే ఎస్ చెప్పించుకోవడం జరిగాయి.ఇదంతా విశ్వసనీయ తమిళ మీడియాలో వచ్చిన కథనమే.

అక్కినేని అఖిల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయిందా.. ఆరోజే పెళ్లి బాజాలు మోగనున్నాయా?
చరణ్ కియరా జోడికి కలసి రాలేదా...అప్పుడు అలా... ఇప్పుడు ఇలా?

ఒకవేళ విజయ్ కనక గేమ్ ఛేంజర్ చేసి రాజకీయ తెరంగేట్రానికి ముందు చేయాల్సిన సరైన సినిమాగా నిలిచిపోయేది.కానీ జరిగింది వేరు.

Advertisement

మూడేళ్లు నిర్మాణంలో ఉన్న ఈ ప్యాన్ ఇండియా మూవీకి విజయ్ అంత సమయం కేటాయించే వాడు కాదు,కానీ ఇండియన్ 2 వల్ల వచ్చిన అడ్డంకులు లేట్ చేశాయి తప్పించి మాములుగా అయితే శంకర్ టార్గెట్ రెండు సంవత్సరాలలోపే రిలీజ్ చేయాలని.అజిత్ విడాముయార్చి వాయిదా పడటం వల్ల ఆ ఆనందంతో విజయ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ కు పూర్తి మద్దతు ఇస్తున్న వైనం సోషల్ మీడియా ట్రెండ్స్ లో కనిపిస్తోంది.

తాజా వార్తలు