'దళపతి68' ఆడియో రైట్స్.. భారీ ధరకు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ!

స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Thalapathy Vijay ) సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్( Lokesh Kanagaraj ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ లియో ( LEO ).

దసరా కానుకగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధిస్తూ దూసుకు పోతుంది.

ఇక ఈ సినిమా హిట్ అవ్వడంతో విజయ్ తన నెక్స్ట్ సినిమాను వెంటనే స్టార్ట్ చేసాడు.తన కెరియర్ లో 68వ సినిమాను విజయ్ పూజా కార్యక్రమాలతో దసరా రోజు గ్రాండ్ గా లాంచ్ చేసారు.

విజయ్ దళపతి నెక్స్ట్ తన 68వ సినిమాను డైరెక్టర్ వెంకట్ ప్రభు ( Venkat Prabhu ) దర్శకత్వంలో చేయనున్నాడు.

గ్రాండ్ గా లాంచింగ్ జరుపు కోవడంతో ఈ సినిమా షూట్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary ) హీరోయిన్ గా నటిస్తుండగా నటి స్నేహ, నటుడు జైరాం, జీన్స్ నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, నటి లైలా, డాన్స్ మాస్టర్ ప్రభుదేవా, స్టార్ కమెడియన్ యోగిబాబు సహా వెంకట్ ప్రభు గ్యాంగ్ నటులు కూడా ఈ సినిమాలో భాగం కానున్నారు.

Advertisement

కాగా కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్నట్టు ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా అలా లాంచ్ చేసారో లేదో వెంటనే ఆడియో హక్కులు 26 కోట్లకు సేల్ అయిపోయాయి.ఈ సినిమా ఆడియో రైట్స్ ను ప్రముఖ మ్యూజిక్ సంస్థ టి సిరీస్( T-Series ) భారీ ధరకు సొంతం చేసుకున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.

ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!
Advertisement

తాజా వార్తలు