టాలీవుడ్ ఇండస్ట్రీలో, కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటులలో విజయ్ సేతుపతి ( Vijay Sethupathi )ఒకరు కాగా ఈ నటుడికి ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
విజయ్ సేతుపతి మరికొన్ని రోజుల్లో మహారాజా సినిమా( Maharaja )తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
తనకు జోడీగా రెండు సినిమాలలో కృతిశెట్టికి ఆఫర్ ఇస్తామన్నా తాను వద్దని చెప్పానని విజయ్ సేతుపతి వెల్లడించడం గమనార్హం.విజయ్ సేతుపతి మాట్లాడుతూ కోలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో నటించాలనుకుంటున్నారా అనే ప్రశ్నకు నేను అలాంటి మల్టీస్టారర్లు( Multistarrer) చేసి విసిగిపోయానని ఆయన పేర్కొన్నారు.
వాటి వల్ల నాకు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు.మరో అగ్ర హీరోతో కలిసి స్క్రీన్ చేసుకోవాల్సి వచ్చిన సమయంలో మన పాత్ర ఎలాంటిదనే విషయం ముందే చెబుతారని విజయ్ సేతుపతి వెల్లడించారు.
దానిలో మనం ఎంత బాగా నటించినా పేరు మాత్రం రాదని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.ఆ స్టార్ హీరోతో సమానంగా నటించినా ఎవరూ గుర్తించరు అని ఆయన చెప్పుకొచ్చారు.విలన్ రోల్స్ లో నటించకూడదని ఫిక్స్ అయ్యానని ఆయన తెలిపారు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి ఆఫర్లు చాలా వచ్చినా తిరస్కరించానని నాకు రొమాంటిక్ సినిమా చేయడం అంటే ఇష్టం అని ఆయన పేర్కొన్నారు.
నేను మంచి లవ్ స్టోరీ ( Love story)కోసం వెతుకుతున్నానని త్వరలోనే అలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తానని విజయ్ సేతుపతి కామెంట్లు చేశారు.క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా మహారాజ మూవీ తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.విజయ్ సేతుపతిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండటం గమనార్హం.
నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ ను ఎంచుకుంటే విజయ్ సేతుపతికి తిరుగుండదని చెప్పవచ్చు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy