Vijay Varasudu Remuneration: వారసుడు మూవీకి విజయ్ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

దిల్ రాజు నిర్మాతగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారసుడు మూవీ పాన్ ఇండియా మూవీ కాగా ఈ సినిమా టోటల్ బడ్జెట్ ఏకంగా 250 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.

ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా 105 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అదనంగా జీఎస్టీ తీసుకున్నారని తెలుస్తోంది.

సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడవడంతో దిల్ రాజు ఏ మాత్రం టెన్షన్ పడటం లేదు.

దిల్ రాజు తెలుగు రాష్ట్రాల నుంచి ఏకంగా 30 కోట్ల రూపాయల కలెక్షన్లు ఆశిస్తున్నారని సమాచారం అందుతోంది.వారసుడు సినిమాకు దిల్ రాజు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

వారసుడు సినిమా దిల్ రాజు సినీ కెరీర్ లోనే అత్యంత భారీ సినిమా అనే సంగతి తెలిసిందే.ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Advertisement

వారసుడు సక్సెస్ సాధించి విజయ్ కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని అభిమానులు భావిస్తున్నారు.

ఈ సినిమాతో విజయ్ రేంజ్ మారాలని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.విజయ్ గత సినిమా బీస్ట్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ రిజల్ట్ ను అందుకుంది.ఆ సినిమా చేదు జ్ఞాపకాలను ఈ సినిమా చెరిపేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.వారసుడు సినిమా రిలీజ్ డేట్ కూడా తాజాగా ఫిక్స్ అయింది.2023 సంవత్సరం జనవరి 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది.వారసుడు మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.

వారసుడు సక్సెస్ వంశీ పైడిపల్లికి కూడా కీలకమనే సంగతి తెలిసిందే.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు